ETV Bharat / bharat

భార్య ముక్కు కోసేసిన భర్త.. అడ్డొచ్చిన కుమార్తెకు ఉరి.. ఆపై సూసైడ్ - ఉత్తర్​ప్రదేశ్​ క్రైమ్ న్యూస్

భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఆమె ముక్కును బ్లేడుతో కోసేశాడు. అక్కడితో ఆగకుండా అడ్డొచ్చిన కుమార్తెను ఉరివేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్​ను ముగ్గురు దుండగులు దారుణంగా కొడవళ్లతో నరికి చంపారు.

father kills daughter
father kills daughter
author img

By

Published : May 11, 2023, 8:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​.. కాన్పూర్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య ముక్కును బ్లేడుతో కోసేశాడు. అక్కడితో ఆగకుండా కన్న కుమార్తెను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమంత్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌబస్తాలో ఛోటూ షా(38), అతడి భార్య రుక్సర్​, కుమార్తె అర్జు(12) నివసించేవారు. బ్రిజేష్ పటేల్ అనే జిల్లా పంచాయతీ సభ్యుడి దగ్గర ఛోటూ కారు డ్రైవర్​గా పనిచేసేవాడు. రుక్సర్​ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఛోటూ అనుమానించేవాడు. దీంతో ఈ దంపతుల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలలు ఈ దంపతులు వేర్వేరుగా ఉన్నారు. అయితే పెద్ద మనుషులు ఒప్పించడం వల్ల మూడు రోజుల క్రితమే వీరిద్దరూ మళ్లీ కలిశారు.

గురువారం ఉదయం ఛోటూ, రుక్సర్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఛోటూ.. భార్య రుక్సర్ ముక్కును బ్లేడుతో కోసేశాడు. అడ్డొచ్చిన కుమార్తె అర్జును ఉరివేసి చంపాడు. అనంతరం తాను కూడా ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. రుక్సార్ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఛోటూ, అర్జు మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

ఆర్టీసీ డ్రైవర్ దారుణ హత్య..
కర్ణాటక.. కలబురగిలో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న బస్సు డ్రైవర్​ను ముగ్గురు దుండగులు వెంబడించి నరికి చంపారు. కలబురగి బస్టాండ్​లో గురువారం జరిగిందీ ఘటన. మృతుడిని నాగయ్యస్వామి(45)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నాగయ్యస్వామి గత 20 ఏళ్లుగా కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్​ఆర్​టీసీ)లో బస్సు డ్రైవర్​గా పనిచేస్తున్నారు. ఆయన కలబురగిలోని మహదేవనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఎప్పటిలానే గురువారం కూడా నాగయ్య విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటల కలబురగి బస్టాప్‌లో నాగయ్య బస్సు దిగుతుండగా ముగ్గురు దుండగులు కొడవళ్లతో ఆయనపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెత్తిన నాగయ్యను వెంబడించి మరీ హత్య చేశారు. నిందితులు కొద్ది దూరం పారిపోయి అక్కడ ఆగి ఉన్న బస్సు దగ్గర హత్యకు ఉపయోగించిన ఆయుధాలను వదిలి పరారయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న బ్రహ్మపుర పోలీసులు, డాగ్​ స్క్వాడ్ సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

bus driver killed karnataka
మృతుడు నాగయ్యస్వామి; ఘటనాస్థలిలో పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.