ETV Bharat / bharat

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానంటూ మహిళకు టోకరా

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానని ఓ మహిళను నమ్మించి మోసానికి పాల్పడ్డాడు ఓ నిరుద్యోగి. మధ్యప్రదేశ్​లోని విదీశాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ukraine
ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానంటూ మోసం
author img

By

Published : Feb 26, 2022, 10:56 PM IST

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానంటూ.. ఓ మహిళను నమ్మించి రూ. 42వేలు తీసుకుని మోసం చేశాడు ఓ నిరుద్యోగి. మధ్యప్రదేశ్​లోని విదీశాలో జరిగిన ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు హరియాణాలోని గురుగ్రామ్​కు చెందిన ప్రిన్స్​ గావగా పోలీసులు గుర్తించారు.

ఇదీ జరిగింది..

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను అంటూ విదీశాకు చెందిన బాధితురాలు వైశాలి విల్సన్​కు నిందితుడు ప్రిన్స్​ బుధవారం ఫోన్​ చేశాడు. ఉక్రెయిన్​లో చిక్కుకున్న వైశాలి కుమార్తెను సురక్షితంగా తిరిగి తీసుకొస్తానని బాధితురాలని నమ్మించాడు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి రూ.42 వేలు తీసుకున్నాడు. డబ్బులు ట్రాన్ఫర్​ చేసిన తర్వాత నిందితుడు బాధితురాలి ఫోన్లకు స్పందించడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్​ పోలీసులు.. శుక్రవారం రాత్రి గురుగ్రామ్​లో అరెస్ట్ చేశారు. నిందితుడిని విదీశాకు తీసుకొచ్చిన పోలీసులు రిమాండ్​కు తరలించారు.

ఇదీ చూడండి : చదువుకు 'పది'తోనే స్వస్తి.. ఆలోచనలు ఆకాశానికి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.