ETV Bharat / bharat

Murder in Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. హైకోర్టు ఎదుటే వ్యక్తి దారుణ హత్య - తెలంగాణ హైకోర్టు ముందు వ్యక్తి దారుణ హత్య

Murder in Hyderabad : హైదరాబాద్‌​ హైకోర్టు సమీపంలో రోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కేవలం రూ. 10,000 కోసం ఒక నిండు ప్రాణాన్ని ఆ దుండగులు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

murder in hyderabad
murder in hyderabad
author img

By

Published : May 4, 2023, 11:07 AM IST

Updated : May 4, 2023, 12:42 PM IST

Murder In Hyderabad: న్యాయాన్ని కాపాడే న్యాయస్థానం ముందే.. ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్​లోని పాతబస్తీ చార్మినార్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని హైకోర్టు సమీపంలో రోడ్డుపై ఒక వ్యక్తిని.. దుండగుడు దారుణంగా హత్య చేశాడు. హైకోర్టు గేట్​ నం.6 సమీపంలో సులభ్​ కాంప్లెక్స్​లో పని చేస్తున్న మిథున్​ అనే వ్యక్తిని.. జనం చూస్తుండగానే కత్తితో దుండగుడు పొడిచి చంపాడు. రూ.10,000 విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఇదే ప్రాంతంలో పండ్లు అమ్ముకునే వ్యక్తికి.. ఆ డబ్బులను ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ డబ్బుల విషయమై వారిరువురి మధ్య తరుచూ గొడవలు జరిగేవని చెప్పారు.

ప్రతిసారి డబ్బులు అడగడంతో ఆజంకు కోపం వచ్చి.. ఎలాగైనా చంపాలని భావించాడని వారు ఆరోపణలు చేశారు. అందుకే మిథున్​ను తన బావమరిది ద్వారా గొడవకు పంపి.. హత్య చేసినట్లు సమాచారం. ఈఘటనపై సమాచారం అందుకున్న చార్మినార్​ పోలీసులు క్లూస్​ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ దారుణ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నారు.

ఓ వ్యక్తిని బండ రాయితో కొట్టి చంపిన దుండగులు: సికింద్రాబాద్​లోని జవహర్​నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కౌకూర్​ హనుమాన్​ టెంపుల్​ వద్ద ఓ వ్యక్తిని బండరాయితో కొట్టి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి జవహర్​నగర్​ పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

మృతునిది మహారాష్ట్రలోని నాగపూర్​కు చెందిన సూరిగా జవహర్​నగర్​ పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బండరాయితో కొట్టడంతో తలకు ఛాతిపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకోని.. అతని దగ్గర నుంచి వివరాలు రాబడుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 4, 2023, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.