ETV Bharat / bharat

పెళ్లి కోసం ప్రధాని మోదీ సంతకం ఫోర్జరీ

వెయ్యి అబద్దాలాడైనా ఓ పెళ్లి చేయాలని నానుడి. ఈ సామెతను ఆదర్శంగా తీసుకున్నట్లున్నాడు ఇతగాడు. ఏకంగా ప్రధాని సంతకాన్నే ఫోర్జరీ చేసి ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.

Man arrested for marrying Alwar girl using fake PMO letter
మగువ కోసం.. మోదీ సంతకం ఫోర్జరీ
author img

By

Published : Dec 21, 2020, 7:24 PM IST

పెళ్లికోసం ప్రధాని నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు మహారాష్ట్రకు చెందిన అమిత్​ కపూర్​ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్​ అల్వార్​కు చెందిన ఓ అమ్మాయితో 2018లోనే ఇతగాడికి పరిచయమైంది. ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో పనిచేస్తానంటూ నమ్మించి ఆమె కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ప్రధాని మోదీ సంతకం ఉన్న ఓ అపాయింట్​మెంట్​ పత్రాన్ని కూడా చూపాడు. ఇదంతా నిజమని నమ్మిన కుటుంబ సభ్యులు వారమ్మాయిని ఇతనికిచ్చి వివాహం చేశారు. కానీ అతడో మోసగాడనే అసలు విషయం తర్వాత తెలుసుకున్నారు.

తమను అమిత్​ కుమార్ మోసం చేశాడని కోత్వాలీ పోలీస్​ స్టేషన్​లో అమ్మాయి కుటుంబ సభ్యులు పిర్యాదు చేశారు. ప్రధాని సంతకాన్ని నిందితుడు ఫోర్జరీ చేసినట్లు వివరిస్తూ పీఎంఓకు లేఖ రాశారు. దీంతో ఈ విషయంపై రాజస్థాన్​ డీజీపీకి పీఎంవో మే 8న లేఖ రాసింది. పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని సీబీఐని కోరింది.

పరారీలో ఉన్న నిందితుడ్ని పక్కా సమాచారంతో రాజస్థాన్​ అల్వార్​లో సోమవారం అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.

ఇదీ చదవండి:'సమష్టి కృషితోనే సమ్మిళిత అభివృద్ధి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.