ETV Bharat / bharat

దీదీతో అఖిలేశ్ జట్టు- టీఎంసీ వ్యూహాలతోనే యూపీ బరిలోకి.. - యూపీ అఖిలేశ్ యాదవ్

ఉత్తర్​ప్రదేశ్ రాజకీయాలకు బంగాల్ ఫ్లేవర్ తోడవనుంది. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. యూపీలో ప్రచారం నిర్వహించే (UP Election 2022) అవకాశం ఉందని తెలుస్తోంది. సమాజ్​వాదీ పార్టీ తరపున దీదీ ప్రచారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోసం దీదీ వ్యూహాలనే అఖిలేశ్ ఉపయోగించుకోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

akhilesh yadav mamata banerjee
akhilesh yadav mamata banerjee
author img

By

Published : Nov 7, 2021, 7:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో సరికొత్త రాజకీయ సమీకరణం తెరమీదకు రానున్నట్లు తెలుస్తోంది. సమాజ్​వాదీ పార్టీతో టీఎంసీ జట్టు కట్టనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఛఠ్ పూజ తర్వాత బంగాల్ సీఎం మమతా బెనర్జీ యూపీలో పర్యటించనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో సమాజ్​వాదీ పార్టీ అధికారికంగా పొత్తు గురించి ప్రకటన చేయనుందని సమాచారం. ఇప్పటికే టీఎంసీ అధినేత్రితో సమాజ్​వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ టచ్​లో ఉన్నారన్నది సంబంధిత వర్గాల మాట. ఫోన్​లో దీదీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయా వర్గాలు చెబుతున్నాయి.

సంప్రదింపులే కాకుండా.. ఎన్నికల్లోనూ దీదీ వ్యూహాన్నే అఖిలేశ్ (UP Election Akhilesh Yadav) పాటిస్తున్నారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు (UP Election 2022) జరగనుండగా.. పార్టీని పూర్తిగా సన్నద్ధం చేసేందుకు జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేశారు. ఓటర్లను చేరుకొని పార్టీ తరపున ప్రచారం చేయడం వీరి ప్రధాన లక్ష్యం. బంగాల్​లో మమత సైతం ఇదే విధంగా జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేసి సఫలమయ్యారు.

ఖేలా హోబె!

దీదీ ఎన్నికల నినాదాన్నీ యూపీ ఎలక్షన్ కోసం ఉపయోగించుకుంటున్నారు అఖిలేశ్. 'ఖేలా హోబె' నినాదాన్ని (Khela Hobe Mamata Banerjee) సొంత రాష్ట్రానికి అన్వయించుకుంటూ.. 'అబ్ యూపీ మే ఖేలా హోయి' (ఇప్పుడు యూపీలో ఆట మొదలవుతుంది) అన్న నినాదాన్ని వినిపిస్తున్నారు. యూపీలోని చాలా ప్రాంతాల్లో ఈ నినాదంతో కూడిన హోర్డింగ్​లను ఏర్పాటు చేశారు.

దీదీతో ప్రచారం

త్వరలో సమాజ్​వాదీ పార్టీ తరపున దీదీ (Mamata Banerjee news) ప్రచారం కూడా చేస్తారని తెలుస్తోంది. దీదీతో పాటు జయా బచ్చన్, డింపుల్ యాదవ్​ సైతం ఎస్​పీ కోసం రంగంలోకి దిగుతారని సమాచారం. భాజపా తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించే ప్రాంతాల్లో దీదీ సభలు ఉంటాయని ఎస్​పీ నేతలు చెబుతున్నారు. పలు జిల్లాల్లో రోడ్​షోలు సైతం నిర్వహిస్తారని తెలిపారు. జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కొనేందుకు దీదీనే సరైన నేత అని ప్రచారమవుతున్న నేపథ్యంలో.. ఆమె ఛరిష్మాను యూపీ ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: అప్పుడు కుస్తీ.. ఇప్పుడు దోస్తీ: బాబాయ్‌ పార్టీతో పొత్తుకు అఖిలేశ్‌ రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.