ETV Bharat / bharat

TMC: మళ్లీ మేనల్లుడికే పీఠం.. వారసుడని చాటిన మమత! - అభిషేక్‌ బెనర్జీ

TMC: టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తిరిగి నియమితులయ్యారు. పార్టీలో దీదీ తర్వాత స్థానం ఆమె మేనల్లుడిదేనని ఈ నియామకం ద్వారా రుజువైంది! టీఎంసీ నేషనల్ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత మమత.. జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు.

Mamata Banerjee
టీఎంసీ
author img

By

Published : Feb 19, 2022, 5:33 AM IST

TMC: తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ తిరిగి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. నూతన కమిటీలో పార్టీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హాకు పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఆయనతోపాటు సుబ్రతా భక్షి, చంద్రిమా భట్టాచార్య కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయయ్యారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న అరూప్‌ విశ్వాస్‌ ట్రెజరర్‌గా వ్యవహరించనుండగా.. కోల్‌కతా మేయర్‌ ఫిర్హద్‌ హకీమ్‌ సమన్వయ కమిటీకి ఇన్‌ఛార్జిగా ఉంటారు.

గతేడాది శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం అనంతరం అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో ప్రాభవం పెరిగింది. దీంతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మమత నియమించారు. అయితే, పార్టీలోని పెద్దలకు, నూతన తరానికి మధ్య విభేదాలు నెలకొన్నాయి. పార్టీలోని సీనియర్లు పార్టీ, ప్రభుత్వంలో ఒకటి కంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తుండడంపై అభిషేక్‌ బెనర్జీ మద్దతున్న కొత్త తరం నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ఈ విషయం మరింత ముదరకముందే జాతీయ ఆఫీస్‌ బేరర్ల కమిటీని ఇటీవల మమత రద్దు చేశారు.

కొత్త కమిటీ ఎంపిక కోసం 20 మందితో నూతన వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు అమిత్‌ మిత్రా, పార్థా ఛటర్జీ, సుబ్రతా బక్షీ, సుదీప్‌ బందోపాధ్యాయ, అభిషేక్‌ బెనర్జీ, అనుబ్రత మొండల్‌, అరూప్‌ బిశ్వాస్‌, ఫిర్హాద్‌ హకీమ్‌, యశ్వంత్‌ సిన్హా తదితరులకు కొత్త కార్యనిర్వాహక కమిటీలో నియమించారు. మమత తీసుకున్న తాజా నిర్ణయంతో పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునేది తానేనని, పార్టీపై నియంత్రణాధికారం తనదేనని చాటుకున్నారు. అలాగే, అభిషేకే వారసుడని తెలియజెప్పారు.

ఇదీ చూడండి: తృణమూల్‌లో గరంగరం.. 'ఒక వ్యక్తికి ఒకే పదవి'పై రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.