ETV Bharat / bharat

'కేంద్ర బలగాలంటే ఎంతో గౌరవం.. కానీ'

కేంద్ర సాయుధ బలగాలంటే తనకెంతో గౌరవమని మమతా బెనర్జీ అన్నారు. కానీ ప్రత్యేకంగా ఒక పార్టీకి ఓటు వేయాలని కేంద్ర బలగాలు.. ప్రజల్ని ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. ఈసీ ఇచ్చిన నోటీసులపై మమత బెనర్జీ ఈ విధంగా స్పందించారు.

author img

By

Published : Apr 10, 2021, 8:57 PM IST

Mamata Banerjee
మమతా బెనర్జీ

ఎన్నికల కోడ్​ను తాను అతిక్రమించలేదని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. కేంద్ర బలగాలపై వ్యాఖ్యల విషయంలో ఎన్నికల సంఘం తనకిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఈసీకి సమాధానం ఇచ్చారు మమత.

కేంద్ర సాయుధ బలగాలు(సీఏపీఎఫ్​) అంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ ప్రత్యేకంగా ఒక పార్టీకి ఓటు వేయాలని సీఏపీఎఫ్ సిబ్బంది.. ప్రజల్ని ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని దీదీ పేర్కొన్నారు. దీనిపై తమ పార్టీ ఫిర్యాదు చేసిందని తెలిపారు. కొన్నింటిని మాత్రమే పరిష్కరించారని చెప్పుకొచ్చారు.

కాగా, రామ్​నగర్​లో ఏప్రిల్​6న ఓ బాలికను సీఆర్​పీఎఫ్​ జవాను వేధించారని దీదీ ఆరోపించారు. అతనిపై పోలీసు స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ కూడా నమోదైందని తెలిపారు.

"ఓటేయడానికి వెళుతున్నప్పుడు ఎవరన్నా, కేంద్రబలగాలే కానీ, అడ్డుకుంటే వాళ్లని చుట్టుముట్టండి" అని అన్నానని మమత ఈసీకి సమాధానమిచ్చారు. ఘెరవ్​(చుట్టుముట్టండి) అనే పదం సత్యగ్రహం పదంతో సమానమని, అది చట్టవ్యతిరేక పదం కాదన్నారు.

కేంద్ర పారామిలిటరీ బలగాలపై మమత.. తప్పుడు, రెచ్చగొట్టే రీతిలో, అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారని ఈసీ ప్రాథమిక విచారణలో తేలింది. మత ప్రాతిపదికన ఓట్లు అడిగారనే ఆరోపణలపైనా మమతకు ఎన్నికల సంఘం ఇదివరకు నోటీసులు జారీచేసింది.

ఇదీ చదవండి: టీఎంసీకి చేటు చేస్తున్న దీదీ వ్యాఖ్యలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.