ETV Bharat / bharat

బంగాల్​ ముఖ్యమంత్రిగా దీదీ ప్రమాణస్వీకారం

బంగాల్ సీఎంగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. అతి తక్కువ మంది దీదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

WB CM
మమతా బెనర్జీ
author img

By

Published : May 5, 2021, 10:56 AM IST

Updated : May 5, 2021, 12:40 PM IST

బంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణం చేశారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో రాజ్​భవన్​లో ఉదయం 10.45 గంటలకు నిరాడంబరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గవర్నర్‌ జగదీప్ ధన్‌కడ్ మమతతో ప్రమాణ స్వీకారం చేయించారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతకు శుభాకాంక్షలు తెలిపారు.

WB CM
ప్రమాణస్వీకారం చేస్తున్న మమతా బెనర్జీ
rajbhavan
రాజ్ భవన్​లో దీదీ

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మమత బెనర్జీకి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

  • Congratulations to Mamata Didi on taking oath as West Bengal’s Chief Minister. @MamataOfficial

    — Narendra Modi (@narendramodi) May 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కొందరు నేతలకే ఆహ్వానాలు పంపించారు. మమత మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి కొద్దిమంది సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణం చేశారు.

mamata
గవర్నర్​తో మమత
leaders
నాయకులు

బంగాల్​లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుకు గానూ 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో తృణమూల్ కాంగ్రెస్ 213సీట్లు, భాజపా 77 సీట్లు, ఇతరులు 2సీట్లు గెలుచుకున్నారు. అయితే, మమతా బెనర్జీ తన స్థానంలో ఓటమిని చవిచూశారు.

ఇదీ చదవండి:'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'

Last Updated : May 5, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.