Mamata Banerjee meets Shiv Sena leaders: శివసేన నాయకులు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లను కలిశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను మమత బెనర్జీ కలవాల్సి ఉంది. కానీ ఆయన ఆనారోగ్యంతో ఉండటం వల్ల.. ఆదిత్య ఠాక్రేను కలిశారు. తన తండ్రి ఫొటోగ్రాఫ్లతో కూడిన బుక్‌ను మమతా బెనర్జీకి ఆదిత్య ఠాక్రే ఇచ్చారు. ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్‌ను కూడా మమత కలవనున్నారు.
అంతకు ముందురోజు సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించారు మమతా బెనర్జీ. 2008 ముంబై ఉగ్రదాడిలో పోరాడి మరణించిన పోలీసు కానిస్టేబుల్ తుకారాం ఓంబాలే స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు.
బంగాల్లో టీఎంసీ అజేయ విజయం సాధించాక జాతీయ రాజకీయాలపై మమతా బెనర్జీ ఎక్కువగా దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇటీవల మేఘాలయాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి ఫిరాయించారు. దీంతో అక్కడ టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.
ఇదీ చదవండి:'రైతుల డిమాండ్లకు కేంద్రం ఓకే.. ఆ రోజున ఆందోళన ముగింపు'