Malegaon Congress Party: మహారాష్ట్రలోని మాలేగావ్‌లో కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. మాలేగావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 28 మంది కార్పొరేటర్లు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో(ఎన్సీపీ)చేరారు. వీరితో పాటు మాలేగావ్ మేయర్ తహీరా షేక్.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సమక్షంలో ఎన్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేబినెట్ మంత్రి జయంత్ పాటిల్ కూడా పాల్గొన్నారు.
"సంకీర్ణ కూటమితో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ పార్టీని విస్తరించుకునే హక్కు మాకు ఉంది. అందువల్ల ఎవరైనా ఎన్సీపీలోకి వస్తే స్వాగతిస్తాం. మాలేగావ్‌లోని 28 మంది పార్టీ నాయకుల్లో 27 మంది ఎన్సీపీలో చేరారు."
-- అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
ముంబయిలోని మలాద్ స్టేడియానికి టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని సూచించినా భాజపా పట్టించుకోలేదని అన్నారు పవార్. టిప్పు సుల్తాన్‌ను హిందు వ్యతిరేకవాదిగా భాజపా చూస్తోందని, అయితే ఇందులో నిజం లేదని తెలిపారు.
మొత్తం 84 మంది మున్సిపల్ కార్పొరేటర్లలో ఇప్పటికే 20 మంది ఎన్సీపీ పార్టీకి చెందినవారు కాగా.. మిగిలినవారు శివసేన(18), భాజపా(9), ఏఐఎంఐఎం(7), జేడీఎస్(6) సభ్యులు.
ఇదీ చూడండి: 'మా నాన్నను గెలిపించండి'.. ఎన్నికల ప్రచారంలో ఏడేళ్ల బాలిక