ETV Bharat / bharat

'ప్రతి పౌరుడికీ న్యాయవ్యవస్థను చేరువ చేయాలి' - తమిళనాడు అంబేద్కర్​ లా యూనివర్సిటీ

ప్రజాస్వామ్యం మరింత వేళ్లూనుకునేలా చేసేందుకు న్యాయ శాస్త్ర విద్యార్థులకు ప్రత్యేక అవకాశం ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తమిళనాడు డా.అంబేద్కర్​ లా విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ప్రతి పౌరుడికి న్యాయవ్యవస్థ మరింత చేరువలో, తక్కువ ఖర్చుతో, అర్థమయ్యే రీతిలో ఉండేలా చేయాలని విద్యార్థులను కోరారు.

Venkaiah Naidu
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Feb 27, 2021, 6:16 PM IST

దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయవ్యవస్థ మరింత చేరువలో, తక్కువ ఖర్చుతో, అర్థం చేసుకునే విధంగా ఉండేలా చేయాలని విద్యార్థులను కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తమిళనాడు డాక్టర్​ అంబేద్కర్​ లా విశ్వవిద్యాలయం(టీఎన్​డీఏఎల్​యూ) 11వ స్నాతకోత్సవం సందర్భంగా న్యాయవ్యస్థపై ప్రసంగించారు. లీగల్​ ప్రక్రియ కోసం పెరిగిపోతున్న ఖర్చులు.. ప్రజలకు న్యాయాన్ని దూరం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

"మన దేశ ప్రజాస్వామ్య వేళ్లను మరింత లోతుగా తీసుకెళ్లేందుకు మీకు ప్రత్యేక అవకాశం ఉంది. ప్రతిఒక్క పౌరుడికి న్యాయవ్యవస్థను మరింత అందుబాటులో, తక్కవ ఖర్చుతో, అర్థమయ్యే రీతిలో ఉండేలా చేసేందుకు ఇది మీకు మంచి అవకాశం. ప్రతిఒక్కరికి న్యాయం పొందటంలో లీగల్​ ప్రక్రియ ఖర్చులు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. సమస్యలు పరిష్కరించే క్రమంలో కనిపించని ఖర్చులెన్నో దాగి ఉన్నాయనేది అందరికి తెలిసిందే. సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా ఓ దారి కనుగొనాలి. ప్రజా సేవకులు, ఎన్నికైన ప్రతినిధులు ఉన్న క్రిమినల్​ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. ఎన్నికలకు సంబంధించిన కేసులు, ఎన్నికల్లో అవకతవకల పర్యవేక్షణ, పార్టీ ఫిరాయింపుల విషయంలో త్వరితగతంగా పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులు అవసరం. "

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

దీర్ఘకాలికంగా కోర్టుల్లో నలుగుతున్న కేసులతో న్యాయం ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్య. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 4 కోట్ల కేసులు పెండింగ్​లో ఉన్నాయని, అందులో చాలా వరకు కింది స్థాయుల్లో ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో మినహా తరుచుగా వాయిదాలు వేసే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. వాయిదాల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. ఒకటి లేదా రెండుకు మించి వాయిదాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. లోక్​ అదాలత్​ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని కోరారు.

విద్యార్థులు తమ వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు వెంకయ్య. అలాగే న్యాయశాస్త్రంలో కొత్త ఆవిష్కరణలకు నాయకత్వం వహించేలా కృషి చేస్తూ.. ఖర్చులు, పెండింగ్​ కేసులను తగ్గించేలా పాటుపడాలన్నారు. కొవిడ్​ సమయంలో ఆన్​లైన్​ కోర్టులు, ఈ-ఫిల్లింగ్​లతో కోర్టులు ప్రజలకు మరింత చేరువయ్యాయని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 5 అసెంబ్లీల ఎన్నికల్లో గెలుపు గుర్రాలేవో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.