పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన నేపథ్యంలో ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. జమ్ము కశ్మీర్‌లోని ఓ బస్టాప్‌లో భారీ స్థాయిలో ఐఈడీని స్వాధీనం చేసుకున్నాయి. ప్రజలతో కిక్కిరిసిపోయిన జమ్ము బస్టాండ్‌లో ఏడు కిలోల ఐఈడీని గుర్తించాయి.
ఐఈడీ గురించి నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఇటీవల జమ్ము కశ్మీర్లో ఇద్దరు కీలక ఉగ్రవాదులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడి యత్నం జరగడం గమనార్హం.
రెండేళ్ల క్రితం ఇదే రోజున సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై పుల్వామాలో దాడి జరిగింది. పాక్ ప్రేరేపిత జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు.
ఇదీ చదవండి: పుల్వామా అమరులకు ప్రముఖుల నివాళి