Road Accident at Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం పొందుగల వద్ద కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో ఐదుగురు మృతి చెందగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ తరలిస్తుండగా మధ్యలో ఒకరు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న 23 మంది కూలీలు తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురానికి చెందిన వారిగా గుర్తించారు. గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన పొందుగల మధ్యలో జరిగినట్టు స్థానికుల వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ కూలీలు ఆంధ్రాకు: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూలి రేట్లు ఆంధ్రలో ఎక్కువగా ఉన్న కారణంగా వలస కూలీల కారణంగా ఇతర ప్రాంతాల నుండి కూలీలను ఆంధ్రకg తీసుకొని వచ్చి.. వారి చేత పని చేయుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఎక్స్గ్రేషియా ప్రకటన: ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సపూర్‌కు చెందిన ఆరుగురు గిరిజన కూలీలు మృతిచెందటం, పలువురు తీవ్రంగా గాయపడడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించిన KCR.. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావును సీఎం ఆదేశించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రమాద సంఘటనను వివరించి తగు సాయం చేయాలన్న కోరిక మేరకు ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇవీ చదవండి: