14 ఏళ్ల గిరిజన బాలికపై 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. బాలికను కిడ్నాప్ చేసిన ఆ వ్యక్తి.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. భీవండీ తాలూకాలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించి నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు.
ఇంట్లో పనికి పెట్టుకుని..
పాల్ఘర్ జిల్లాకు చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. తెలిసిన వ్యక్తి ఇంట్లో పని కోసం వారి కూతురిని భీవండీకి పంపించారు. కొద్దిరోజుల అనంతరం బాలిక తల్లితండ్రుల వద్దకు తీసుకెళ్లాలని తన యజమానిని కోరింది. దీనితో ఇద్దరూ పాల్ఘర్కు బైక్పై బయలుదేరారు. ఈ క్రమంలో అంగావ్ అనే ఊరికి చేరుకోగానే.. నిందితుడు బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
'అరవడానికి ప్రయత్నించిన బాలికను తీవ్రంగా కొట్టిన నిందితుడు ఘటన గురించి ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అనంతరం బాధితురాలిని తల్లిదండ్రుల వద్ద దింపేసి వెళ్లిపోయాడు' అని పోలీసులు తెలిపారు.
అయితే.. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలపగా.. ఓ ఎన్జీఓ సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. బాధితురాలిని భీవండీలోని బాలల గృహానికి తరలించారు.
ఇవీ చదవండి: