ETV Bharat / bharat

నీటి కోసం 2 కి.మీ నడక.. నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి..

author img

By

Published : Apr 15, 2022, 4:13 PM IST

Updated : Apr 15, 2022, 8:34 PM IST

Water crisis: మహారాష్ట్ర నాసిక్​లో నీటి కోసం సాహసం చేస్తున్నారు మహిళలు. గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి నీటిని తోడుకుంటున్నారు. మరోవైపు.. ఛత్తీస్​గఢ్​లోని ఓ గ్రామంలో నీటి సమస్యను అధిగమించేందుకు జలపాతం నుంచి కిలోమీటర్​ పైపును అనుసంధానించారు గ్రామస్థులు.

Nashik water shortage
Nashik water shortage
నీటి కోసం 2 కి.మీ నడక.. నిచ్చెన, తాళ్లతో బావిలోకి దిగి..

Nashik water shortage: మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని రోహిలే గ్రామంలో నీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే తాగడానికి చుక్క నీరు లేక అల్లాడిపోతున్నారు. దీంతో గ్రామంలోని మహిళలు గత్యంతరం లేక తాగునీటి కోసం 2 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. అక్కడున్న ఓ బావి నుంచి నీటిని తోడుకుంటున్నారు. నిచ్చెన, తాళ్ల సాయంతో బావిలోకి దిగి సాహసం చేస్తున్నారు.

Nashik water shortage
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని రోహిలే గ్రామంలో నీటి కొరత

Water problem: తాగునీటి కోసం ఒక్కోసారి క్లాస్​లకు దూరం కావాల్సి వస్తోందని గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. " మా గ్రామంలో నీళ్లు లేవు. వేరే గ్రామానికి వెళ్లి అక్కడున్న బావి నుంచి నీటిని తోడుకుంటాం. దీని కోసం ఒక్కోసారి తరగతులకు కూడా దూరం కావాల్సి వస్తోంది. వేరే గ్రామానికి వెళ్లడం వల్ల ఓసారి పరీక్షకు కూడా ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది." అని ప్రియ తెలిపింది.

అయితే అధికారులు మాత్రం గ్రామంలో నీటి కొరత సమస్యకు అవకాశమే లేదని చెబుతున్నారు. జూన్​ వరకు సరిపడా నీటి సదుపాయం ఉన్నట్లు చెప్పారు. "కలెక్టర్​ కార్యాలయం నుంచి అందిన వివరాల ప్రకారం తాగునీటిని ప్రత్యేకంగా వేరు చేశాం. మిగతా నీటిని వ్యవసాయ అవసరాల​ కోసం కేటాయించాం. కాబట్టి నీటి కొరతకు అవకాశం లేదు. కనీసం జూన్ వరకు సరిపడా నీళ్లు ఉన్నాయి" అని అధికారి అల్కా చెప్పారు.

జలపాతం నుంచి కి.మీ పైపు: ఛత్తీస్​గఢ్ సర్​గుజా జిల్లాలోని జామా గ్రామంలోనూ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రామస్థులే చందాలు వేస్కొని కిలోమీటర్ పైపును సమీపంలోని జలపాతంతో అనుసంధానించారు. ఈ పైపే ఇప్పుడు నీళ్లకు ఆధారం. గ్రామంలో చేతి పంపు ఉన్నా అది పనిచేయడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్థులు చెప్పారు. అందుకే తామే డబ్బులు పోగు చేసుకుని పైపు వేసుకున్నట్లు తెలిపారు.

water shortage
జలపాతం నుంచి పైపు వేసిన గ్రామస్థులు
water shortage
జలపాతం నుంచి పైపు వేసిన గ్రామస్థులు

ఇదీ చదవండి: శరీరమంతా విషం.. ప్రాణాపాయంలో తల్లి.. బాలుడి చాకచక్యంతో...

Last Updated : Apr 15, 2022, 8:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.