ETV Bharat / bharat

లేడీ కిలాడీల పక్కా ప్లాన్​- క్షణాల్లో 3 కిలోల బంగారం చోరీ - gold theft news

అదో జువెలరీ షాపు. మధ్యాహ్నం వేళ ఓ ఇద్దరు మహిళలు.. బంగారం కొనడానికి అక్కడకు వచ్చారు. కాసేపు నగలు కొంటున్నట్లుగా నటించారు. కానీ, చివరకు ఆ షాపు నుంచే రూ.1.2 కోట్లు విలువైన బంగారాన్ని దోచేశారు.

gold stolen news in pune
బంగారం చోరీ వార్తలు
author img

By

Published : Sep 20, 2021, 3:51 PM IST

నగల దుకాణంలో బంగారం కాజేసిన మహిళలు

మహారాష్ట్ర పుణెలో(Maharashtra Pune News) ఓ ఇద్దరు మహిళలు.. భారీ చోరీకి పాల్పడ్డారు. ఓ జువెలరీ షాపు నుంచి రూ.1.2 కోట్లు విలువ చేసే బంగారాన్ని కాజేశారు. అయితే.. వీరి తతంగం అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

అసలేం జరిగిందంటే..?

పుణె(Maharashtra Pune News) రవివార్ పేఠ్​లోని ఓ బంగారు నగల షాపులోకి శనివారం మధ్యాహ్నం ఇద్దరు మహిళలు.. నగలు కొనేందుకు వచ్చారు. అయితే.. అదే సమయంలో ముంబయికి చెందిన ఓ జినేశ్​ బోరానా అనే బంగారం వ్యాపారి 3 కిలోల 139 గ్రాముల బంగారాన్ని తెల్లని ప్లాస్టిక్ బాక్సులో పెట్టుకుని ఆ షాపుకు వచ్చాడు. ఈ క్రమంలో అతని వద్ద ఉన్న బంగారం బాక్సును ఈ మహిళలు కాజేశారు.

దీనిపై బాధితుడు బంగారం వ్యాపారి జినేశ్​ బోరానా(33) ఫరాస్​ఖానా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఓ బాలుడు సహా ఆ ఇద్దరు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలు కాజేసిన బంగారం ధర రూ.1.2 కోట్లుగా ఉంటుందని చెప్పారు.

ఇదీ చూడండి: కుర్రాడి స్మార్ట్​ ఐడియా.. అలెక్సా మాదిరిగా 'స్మార్ట్ మిర్రర్'

ఇదీ చూడండి: రైలు కింద పడిన మహిళ- తప్పిన ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.