ETV Bharat / bharat

బాబాయ్ X అబ్బాయ్​.. వేర్వేరుగా ఇరువర్గాల భేటీ.. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనవైపే! - maharashtra ncp latest news

Maharashtra Political Crisis : తమ బలాన్ని చాటుకునేందుకు ఎన్​సీపీలోని శరద్‌ పవార్‌, అజిత్ పవార్ వర్గాలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించాయి. అజిత్ పవార్ వర్గం సమావేశానికి భారీగా ఎమ్మెల్యేలు తరలివచ్చారు.

Maharashtra Political Crisis
Maharashtra Political Crisis
author img

By

Published : Jul 5, 2023, 11:08 AM IST

Updated : Jul 5, 2023, 1:20 PM IST

Maharashtra Political Crisis : మహారాష్ట్ర ఎన్​సీపీలో చీలిక నేపథ్యంలో ఇరువర్గాలు బలప్రదర్శన చేశాయి. శరద్‌ పవార్‌, అజిత్ పవార్ వర్గాలు.. బుధవారం వేర్వేరుగా సమావేశమయ్యాయి. పార్టీ ఇరువర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో.. ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలో వైబీ చవాన్‌ సెంటర్‌లో సమావేశం జరిగింది. మరోవైపు, అజిత్‌ పవార్‌ సైతం ఎమ్మెల్యేలు, ఎంపీలతో బాంద్రాలో ఉన్న ముంబయి ఎడ్యుకేషన్ ట్రస్ట్‌ (ఎంఈటీ) భవనంలో సమావేశం నిర్వహించారు.

  • Amid NCP vs NCP crisis in Maharashtra, two different meetings take place simultaneously in Mumbai.

    Deputy CM Ajit Pawar has called a meeting of all NCP MPs, MLAs, MLCs, District heads and State delegates at MET Bandra while Sharad Pawar has called a meeting of all members at YB… pic.twitter.com/oe9b8z1AcV

    — ANI (@ANI) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పోటాపోటీగా నిర్వహించిన ఈ సమావేశాల్లో ఆయా వర్గాలకు చెందిన కార్యకర్తలు సందడి చేశారు. పోటాపోటీగా తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. సమావేశం జరిగిన ఎంఈటీ భవనం వద్ద అజిత్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ముంబయి దేవగిరిలోని ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నివాసానికి పెద్ద సంఖ్యలో మద్దతుదారులు చేరుకుని.. ఆయనకు అనుకూల నినాదాలు చేశారు.

  • #WATCH | Sharad Pawar loyalists raise slogans in his support as leaders of his faction of NCP arrive at YB Chavan Centre in Mumbai, for the party's meeting. pic.twitter.com/MRGaSFPu5E

అజిత్ పవార్ సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాల్లో భాగంగా అజిత్ పవార్ వర్గం.. తమ మద్దతుదారుల నుంచి అఫిడవిట్లు సేకరించింది. అజిత్ పవార్​కు చెందిన ఎన్​సీపీకే విధేయులుగా ఉంటామని కార్యకర్తల నుంచి హామీ తీసుకుంది. పార్టీలోని నేతలందరి మద్దతు తమకే ఉందని అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ పేర్కొన్నారు. దీనిపై తమకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పారు. సమావేశానికి ముందు ఎంఈటీ భవనం వద్ద ఎన్​సీపీ జెండాను ఆవిష్కరించారు అజిత్ పవార్.

  • NCP (Ajit Pawar faction) is taking affidavits from party workers to show their allegiance to Ajit Pawar's NCP, at MET Bandra. pic.twitter.com/RKPbNK3pF2

అంతకుముందు, పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా సమావేశానికి తప్పక హాజరుకావాలని ఎన్​సీపీ రెండు వర్గాల నోటీసులు జారీ అయ్యాయి. సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటామని శరద్ పవార్ వర్గం నేత జితేంద్ర అవహద్ విప్ జారీ చేశారు. అయితే, ఎన్​సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్​, జితేంద్ర అవహద్​ల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని అజిత్ వర్గం స్పీకర్​ను కోరింది.

పార్టీ పేరు, గుర్తుపై రగడ
మరోవైపు, పార్టీ పేరు, గుర్తు తమదేనని అజిత్ పవార్ ఆరోపించిన నేపథ్యంలో శరద్ పవార్ వర్గం అప్రమత్తమైంది. ఈ విషయంపై తమను సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని శరద్ పవార్ వర్గం కోరింది. ఈ మేరకు కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. శివసేన చీలిక సమయంలో ఏక్​నాథ్ శిందే వర్గానికే పార్టీ పేరు, గుర్తును కట్టబెడుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ సైతం.. తిరుగుబాటు చేసిన వెంటనే పార్టీ పేరు, గుర్తు తమదేనంటూ వాదన తెరపైకి తెచ్చారు.

Maharashtra Ncp Crisis :
శరద్​ పవార్​ తమకు గురువు లాంటి వారని.. ఆయనను ఎప్పుడూ గౌరవిస్తామన్నారు ఎన్​సీపీ బహిష్కృత నేత ప్రఫుల్ పటేల్​. ఆయన తమకు తండ్రి లాంటి వారని.. ఆయన ఫొటోను గౌరవంగానే పెట్టుకున్నామని స్పష్టం చేశారు. తమకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. దీంట్లో ఎలాంటి సందేహం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. 2022లో శిందే తిరుగుబాటు చేసినప్పుడు మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయినప్పడు.. తాము ప్రభుత్వంలో చేరుతామని 51 మంది ఎమ్మెల్యేలు భావించారని గుర్తు చేశారు.

ఇవీ చదవండి : ఉత్కంఠగా 'మహా' పాలిటిక్స్​.. శరద్​​​కు కాంగ్రెస్​ మద్దతు.. శిందే సర్కార్‌పై MVA పోరు!

తిరిగి NCP గూటికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ.. శరద్ పవార్ పక్కా స్కెచ్!

Last Updated : Jul 5, 2023, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.