సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతులు చేపట్టిన భారీ ర్యాలీ ముంబయికి చేరింది. నాసిక్ ప్రారంభమైన ఈ ర్యాలీలో 15వేల మంది ప్రజలు పాల్గొన్నారు. వీరంతా.. ముంబయి ఆజాద్ మైదానంలో సోమవారం అన్నదాతలు నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు ఈ సభలో పాల్గొననున్నట్లు ఆలిండియా కిసాన్ సభ నాయకులు వెల్లడించారు. అటు పంజాబ్లోని లుథియానాలోనూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
![Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10365031_yygf.png)
![Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10365031_hhhhs.jpg)
భారీ భద్రత నడుమ..
రైతుల సభ సోమవారం జరగనుంది. ఈ నేపథ్యంలో సభాస్థలి అయిన అజాద్ మైదానం వద్ద మహారాష్ట్ర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసులు బలగాలను రంగంలోకి దించిన అధికారులు.. ర్యాలీని డేగ కళ్ల(డ్రోన్)తో పహారా కాస్తున్నారు.
![Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10365031_hhfgfgf.jpg)
![Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10365031_hhh.png)
![Maharashtra: Farmers from Nashik reach Azad Maidan in Mumbai.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10365031_hfff.png)
పార్టీల సంఘీభావం..
ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్ర రైతులు చేపట్టన ఈ ర్యాలీకి 'మహా' నేతలు సంఘీభావం ప్రకటించారు. శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీతో పాటు అధికార శివసేన కూడా మద్దతు ప్రకటించింది. సోమవారం ఇరుపార్టీల నేతలు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహించనున్న కిసాన్ పరేడ్లో ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి దాదాపు 25000 ట్రాక్టర్లు పాల్గొననున్నాయని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ శనివారం తెలిపారు. దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీకి దిల్లీ పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ర్యాలీ నిర్వహించే మార్గాలను త్వరలో సంయుక్త్ కిసాన్ మోర్చా నిర్ణయిస్తుందని తికాయత్ అన్నారు.
ఇదీ చూడండి: రైతులకు మద్దతుగా మహారాష్ట్రలో కిసాన్ మార్చ్