ETV Bharat / bharat

19 ఏళ్ల యువకుడిపై 'గ్యాంగ్ రేప్'.. పొదల్లోకి పిలిచి.. - కేరళ

19 ఏళ్ల యువకుడిపై మరో ఇద్దరు యువకులు అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరో ఘటనలో స్నేహితుడితో కలిసి ఉన్న బాలికపై లైంగిక దాడి చేశారు నలుగురు వ్యక్తులు. ఈ దారుణం కేరళలో వెలుగుచూసింది.

Maharashtra Crime News
nagpur crime news
author img

By

Published : May 30, 2022, 4:28 PM IST

Maharashtra Crime News: మహారాష్ట్ర నాగ్​పుర్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు మరో ఇద్దరు యువకులు. బాధితుడి ఫిర్యాదు, మెడికల్ రిపోర్ట్​ ఆధారంగా వారిపై నందన్​వన్​ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. నిందితులను అవేశ్​ మిర్జా, అనిల్​గా గుర్తించారు అధికారులు.

ఇదీ జరిగింది: బాధిత యువకుడికి, నిందితులకు ఓ ఆన్​లైన్ అప్లికేషన్​ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నందన్​వన్​లోని మెటర్నిటీ వార్డు సమీపంలో ఉన్న పొదల్లోకి రావాలని సదరు యువకుడిని వారు పిలిచారు. అక్కడికి చేరుకోగానే.. అతడిపై అసహజ సంభోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

బాలికపై నలుగురు కలిసి..: కేరళలోని ఇడుక్కిలో మైనర్​పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు.. బంగాల్​ నుంచి వలస వచ్చిన కూలీలని తెలిపారు.

"ఒక స్నేహితుడితో కలిసి తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచిన పూప్పర గ్రామానికి ఆ బాలిక వెళ్లింది. అతడితో మాట్లాడుతున్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆ స్నేహితుడిని కొట్టి, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. సహాయం కోసం కేకలు పెట్టగా.. స్థానికులు అక్కడికి చేరుకొని వారిని కాపాడారు. కానీ నిందితులు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం ఎఫ్​ఐఆర్​ నమోదైంది. ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్నాం. దర్యాప్తు ముమ్మరం చేశాం" అని ఓ సీనియర్​ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: సిద్ధూ హత్య వీడియో వైరల్​.. ఏడుగురు అనుమానితులు గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.