ETV Bharat / bharat

'మహా'లో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కరోనా కేసులు - కరోనా కేసులు

Maharashtra cases today: మహారాష్ట్రలో వరుసగా మూడోరోజు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం కొత్తగా 1,357 మందికి వైరస్​ సోకింది. ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో మాస్క్​ తప్పనిసరి అంశంపై క్లారిటీ ఇచ్చింది ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ.

maharashtra cases today
కరోనా కేసులు
author img

By

Published : Jun 4, 2022, 10:55 PM IST

Maharashtra cases today: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం కొత్తగా 1,357 మంది వైరస్​ బారినపడ్డారు. ఒకరు వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శుక్రవారం.. 1134 కేసులు రాగా.. ముగ్గురు మరణించారు. దీంతో వరుసగా మూడో రోజు వెయ్యికిపైగా కొత్త కేసులు వచ్చినట్లయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,888 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 78,91,703కు చేరగా.. మరణాలు 1,47,865కు చేరాయి. శనివారం మరో 595 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 77,37,950కి చేరింది. రికవరీ రేటు 98.05శాతం, మరణాల రేటు 1.87 శాతంగా ఉంది.

శనివారం నమోదైన కొత్త కేసుల్లో కేవలం ముంబయిలోనే 889 మందికి వైరస్​ సోకటం ఆందోళన కలిగిస్తోంది. ఒక మరణం కూడా ముంబయిలోనే సంభవించటం గమనార్హం. నావీ ముంబయి మున్సిపాలిటీ పరిధిలో 104 కేసులు, ఠాణె, ఫూణెల్లో వరుసగా 91, 68 కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం మొత్తం 31వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

మాస్క్​పై క్లారిటీ: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కొవిడ్​ నిబంధనలు పాటించాలని, మాస్క్​ ధరించాలని సూచించించారు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే. అయితే, మాస్క్​ ధరించటం తప్పనిసరి కాదని, ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలని సూచించారు.'శుక్రవారం ఆరోగ్య శాఖ విడుదల చేసిన లేఖలో మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. అది ప్రజలు మాస్క్​ పెట్టుకోవాలని చేసిన వినతి మాత్రమే. మాస్క్​ ధరించనివారిపై ఎలాంటి చర్యలు ఉండవు. రైళ్లు, బస్సులు, పాఠశాలలు, కళాశాలల వంటి ప్రాంతాల్లో మాస్క్​ ధరించాలని కోరుతున్నాం.' అని తెలిపారు.

ఇదీ చూడండి: నృత్యం చేస్తూ పిల్లలకు వైద్యం.. ఈ 'డ్యాన్సింగ్​ డాక్టర్​' స్టైలే వేరు!

హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు.. అక్కడ తొలిసారి

'కార్బెవాక్స్‌' బూస్టర్​ డోసుకు ఆమోదం.. వారు సైతం తీసుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.