ఒక్కపాము కనబడితేనే 'అమ్మో పాము' అని హడలిపోతాం. అలాంటిది ఇంట్లోనే కుప్పులుతెప్పలుగా పాములు ప్రత్యక్షమైతే ఇంకెలాగుంటుంది? ఊహించడానికే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా? ఇలాంటి ఘటనే మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జరిగింది. ఓ ఇంట్లో ఏకంగా ఒకేసారి 22 కోబ్రా పిల్లలు కనపించడం కలకలం రేపింది.
అసలేం జరిగింది?
అమరావతి జిల్లా ఉత్తమ్సారా గ్రామానికి చెందిన మంగేష్ సాయంకే కుటుంబం.. బంధువుల ఇంట్లో ఓ వేడుక కోసం కొన్నిరోజులపాటు ఇల్లు వదలి వెళ్లింది. అయితే.. వారు తిరిగి వచ్చి చూడగా తమ ఇంట్లో వారికి పాము కుబుసం కనిపించింది. అదేరోజు సాయంత్రం తమ పడక కింద వారు ఓ సర్పాన్ని గుర్తించారు. అప్పుడు పాముల సంరక్షకులను పిలిపించి, దానిని పట్టుకున్నారు.
అయితే.. ఆ మరుసటిరోజు మరో రెండు పాము పిల్లలు మంగేష్ కుటుంబ సభ్యులకు కనిపించాయి. అప్పుడు పాముల సంరక్షకుల సాయంతో ఇల్లంతా వెతకగా.. మొత్తం 22 పాము పిల్లలు బయటపడ్డాయి. వాటిని పట్టుకుని సమీపంలోని అడవిలో వదలిపెట్టారు.
ఇదీ చూడండి: ఉప్పొంగుతున్న నది- నిచ్చెన వేసి ప్రాణాలు కాపాడిన సిబ్బంది
ఇదీ చూడండి: ఫ్లైట్లో వచ్చి బైక్ల చోరీ- ఓఎల్ఎక్స్లో దందా!