కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం కేసులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. కరోనా నిబంధనల దృష్ట్యా ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్ గాంధీని మినహాయించాలని ఆయన తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని అభ్యర్థించగా... భీవండీ మేజిస్ట్రేట్ కోర్టు సానుకూలంగా స్పందించింది. విచారణను మే 15కు వాయిదా వేసింది.
ఆర్ఎస్ఎస్పై వ్యాఖ్యల కేసు..
2014లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. మహాత్మా గాంధీ హత్యకు, ఆర్ఎస్ఎస్కు ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై మహారాష్ట్రలోని ఠానే జిల్లా భీవండీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంతే పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
అయితే 2018లో భివండీలోని మేజిస్ట్రేట్ ముందుకు హాజరైన రాహుల్.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిరాధారమైన ఆరోపణలతో కోర్టును పక్కదోవ పట్టిస్తున్నారని వివరించారు.
ఇదీ చదవండి: టూల్కిట్ కేసులో నికిత, శంతను విచారణ