ETV Bharat / bharat

టీకా వద్దని మొండికేసి.. భార్య ఆధార్​ కార్డు తీసుకొని చెట్టెక్కి..

ప్రభుత్వాలు, సెలబ్రిటీలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రజల్లో టీకాపై అపోహలు తొలగిపోలేదనడానికి నిదర్శనమే ఈ ఘటన. అనవసర భయాలతో టీకా తీసుకునేందుకు నిరాకరించాడో వ్యక్తి. అంతేగాక.. తన భార్య ఆధార్​ కార్డు తీసుకుని చెట్టెక్కాడు. మధ్యప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన.. టీకాలపై ప్రజల్లో నెలకొన్న అవగాహనా లేమిని సూచిస్తోంది.

madhyapradesh
టీకా వద్దని మొండికేసి.. భార్య ఆధార్​ కార్డు తీసుకొని చెట్టెక్కి
author img

By

Published : Jun 26, 2021, 1:54 PM IST

మూడో దశ కరోనా విజృంభించవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది మధ్యప్రదేశ్​ ప్రభుత్వం. ఈ ప్రక్రియ గ్రామాల్లోనూ జోరుగా సాగుతోంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అనవసర భయాలతో ప్రజలు టీకాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా పఠాన్ కాలా గ్రామంలో టీకా పంపిణీ సిబ్బందిని చూసిన ఓ వ్యక్తి తన భార్య ఆధార్ కార్డును దాచిపెట్టాడు. అతంటితో ఆగక.. ఆ కార్డును తీసుకుని చెట్టుపైకి ఎక్కి నిలుచున్నాడు.

MP: Fearing corona vaccination in Rajgarh man climbed on tree with his wife Aadhar card
టీకా వద్దని మొండికేసి.. భార్య ఆధార్​ కార్డు తీసుకొని చెట్టెక్కి

మొదట ఓకే.. తర్వాత నాట్ ఓకే!

పఠాన్ కాలా గ్రామంలో టీకా పంపిణీపై నిర్వాహకులు గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన కన్వర్​లాల్ అనే వ్యక్తితో పాటు.. అతని భార్య టీకా తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. తీరా టీకా కేంద్రానికి చేరుకున్నాక.. తన భార్య ఆధార్ కార్డు తీసుకుని పరుగెత్తి చెట్టు ఎక్కాడు. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందని.. అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నాడు. చివరకు అతడు టీకా తీసుకోలేదు, తన భార్యనూ తీసుకోనివ్వలేదు.

ఇదీ చదవండి: 'టీకాపై అపోహలు తొలగించండి'

చాలా సేపు చెట్టుపైనే గడిపిన కన్వర్​లాల్.. సిబ్బంది తీసుకొచ్చిన టీకాలు అయిపోయాయని తెలుసుకుని కిందికి దిగి వచ్చాడు. వ్యాక్సిన్ తీసుకునేలా అతన్ని ఒప్పించేందుకు గ్రామస్థులు ప్రయత్నిస్తున్నారు.

93ఏళ్ల వృద్ధురాలు రయ్ రయ్..

ఇక ఈ ఘటనకు విరుద్ధంగా.. టీకాలపై ఉన్న అపోహలను తొలగించే ఘటన అదే జిల్లా కురవర్ గ్రామంలో జరిగింది. 93 సంవత్సరాల ఓ వృద్ధురాలిని తన వీపుపై మోస్తూ టీకా పంపిణీ కేంద్రానికి తీసుకువచ్చాడు ఓ యువకుడు. తన అమ్మమ్మ కరోనా బారిన పడకుండా ఉండేందుకే టీకా వేయిస్తున్నట్లు పేర్కొన్నాడు.

రాజ్​గఢ్​ జిల్లాలో వృద్ధులకు టీకాలు వేయిస్తున్న బంధువులు

టీకా కేంద్రానికి తన అమ్మమ్మను భుజాలపై మోసుకొస్తున్న యువకుడు

టీకాలపై అవగాహన ఉన్న ప్రజలు ఇలా తీసుకుంటుంటే.. మరికొందరు ససేమిరా అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.