మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్.. ప్రజల ఫిర్యాదులపై తనదైన శైలిలో స్పందించారు. గ్వాలియర్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలపై చెట్లకొమ్మలు ఆనుకోవడం వల్ల పవర్ సరిగా ఉండట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దాంతో మోతీజీల్ పవర్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ ట్రాన్స్‌ఫార్మన్‌ను ఆనుకుని చెట్ల తీగలు ఉండడాన్ని గమనించి స్వయంగా నిచ్చెన వేసుకుని తీగలను తొలగించారు. పనిలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన అధికారుల్ని మందలించారు. ఇంకోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు.
గ్వాలియర్‌లోని మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్స్ సరిగా లేవని ఓ మహిళా సిబ్బంది ఇదే మంత్రి (అప్పట్లో ఎమ్మెల్యే)కి ఫిర్యాదు చేసింది. దాంతో ఆయనే స్వయంగా వచ్చి టాయిలెట్లను శుభ్రపరిచారు.
ఇదీ చదవండి: నదిలో చిన్నారిని రక్షించిన వ్యక్తికి సర్కారు బహుమతి