మధ్యప్రదేశ్‌కు చెందిన నాయక్ విజయ్ బహదూర్ సింగ్.. 17 ఏళ్ల పాటు సైనికుడిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. ఇటీవలే.. నీముచ్(స్వస్థలం)కు తిరిగొచ్చిన నాయక్‌కు ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. డోలు, సన్నాయిలతో ఊరేగింపు నిర్వహించి గుడికి తీసుకెళ్లారు. ఆ జవాన్‌ను కాలు కింద పెట్టనీయకుండా తమ చేతులపై నడిపించి.. ఆలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు నాయక్.
"నేను 17 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేశాను. ఈ రోజు.. ఊరి ప్రజలు నాకిచ్చిన ఈ గౌరవాన్ని సాదరంగా ఆహ్వానిస్తూ గర్వపడుతున్నాను."
- నాయక్ విజయ్ బహదూర్ సింగ్
ఇదీ చదవండి: పురిటి నొప్పులతోనే నదిని దాటి ప్రసవం!