మద్యం మత్తులో మధ్యప్రదేశ్‌కు చెందిన రాము సింగ్ సిసోడియా అనే యువకుడు వీరంగం సృష్టించాడు. మురైనా పోర్సా టెహ్సిల్ ప్రాంతంలోని స్వాతంత్ర్య సమరయోధుడు సాధు సింగ్ తోమర్ విగ్రహం పైకి ఎక్కాడు. తలతో విగ్రహం పైభాగాన్ని పగలగొట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేశాడు.
యువకుడి ప్రవర్తనను చూసి ఓ స్థానికుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విగ్రహంపై ఉన్న యువకుడిని కర్రతో చితకబాదాడు. అయినప్పటికీ.. రాము కిందకి దిగకుండా విగ్రహాన్ని పగలగొట్టే పనిలో నిమగ్నమయ్యాడు. చివరకు స్థానికుడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక కిందపడిపోయాడు.
అయితే.. కిందపడిన తర్వాత రాము సింగ్ తలకు గాయమై స్పృహతప్పి పడిపోయాడు. యువకుడిని వెంటనే ఆసుపత్రిగా తరలించారు స్థానికులు. అతడిని కిచౌల్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చదవండి:రిపబ్లిక్ డే రోజు అంబేడ్కర్ విగ్రహం ముందే కాల్పులు