ETV Bharat / bharat

మధ్యప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధం- బీజేపీ అభివృద్ధి మంత్రం Vs కాంగ్రెస్ ఓబీసీ జపం! - మధ్యప్రదేశ్ పోలింగ్ తేదీ

Madhya Pradesh Election 2023 : భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ గెలుపు తమదంటే తమదని భావిస్తున్న మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి శుక్రవారం ఒకే విడతలో ఓటింగ్‌ జరగనుంది. భాజపా, కాంగ్రెస్‌, ఎస్​పీ, బీఎస్​పీ, ఆప్‌, జేడీయూ పోటీ చేస్తున్నప్పటికీ.. కమలం, హస్తం గుర్తుల మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది.

madhya_pradesh_election_2023_news
madhya_pradesh_election_2023_news
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 5:01 PM IST

Updated : Nov 16, 2023, 8:03 PM IST

Madhya Pradesh Election 2023 : అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్య నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొన్న మధ్యప్రదేశ్‌లో శాసనసభ సమరానికి సర్వం సిద్ధమైంది. 230 స్థానాలు ఉన్న మధ్యప్రదేశ్‌ శాసనసభ బరిలో వివిధ పార్టీల తరఫున 2,533 మంది పోటీలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్‌, బీఎస్​పీ, ఎస్​పీ, ఆప్‌, జేడీయూ ఎన్నికల సమరంలో ఉన్నప్పటికీ.. పోటీ ప్రధానంగా కమలం, హస్తం పార్టీల మధ్యే నెలకొంది. ఇరుపార్టీల నేతలు అధికారం తమదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

MP ELECTION NEWS
మధ్యప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మధ్యప్రదేశ్‌లో మొత్తం 5,60,60,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 2,88,25,607 మంది, మహిళలు 2,72,33,9,45. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 1373 మంది ఉన్నారు. 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా.. ఎన్నికల సంఘం 2049 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్​, దిండోరీలోని 4 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనుపమ్ రాజన్ తెలిపారు.

  • #WATCH | Madhya Pradesh Elections | Polling material being distributed to election officials in Chhindwara ahead of the state assembly elections that will be held tomorrow, 17th November. pic.twitter.com/AiLbbIjExh

    — ANI (@ANI) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అభివృద్ధి పథకాలపై బీజేపీ ఆశలు!
మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని కమలం పార్టీ, ఈసారి పూర్తి మెజార్టీతో పాలనా పగ్గాలు చేపట్టాలని హస్తం పార్టీలు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డాయి. అన్నివర్గాలను ఆకట్టుకునేందుకు ఎన్నో హామీలు ఇచ్చాయి. భాజపా తరఫున ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సహా మరికొందరు ప్రముఖులు ప్రచారం చేశారు. అభివృద్ధి నినాదంతోపాటు కేంద్రంలో మోదీ అమలు చేస్తున్న పథకాలను కమలం నేతలు ఏకరవు పెట్టారు.

కాంగ్రెస్ ఓబీసీ మంత్రం!
కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కులగణనతోపాటు మధ్యప్రదేశ్‌ జనాభాలో 48శాతం ఉన్న ఓబీసీలకు సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు హస్తం నేతలు హామీ ఇచ్చారు.

నాటకీయ పరిణామాలు..
2018 ఎన్నికల్లో 114 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌.. బీఎస్​పీ, ఎస్​పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2020 మార్చిలో ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత భాజపాకు చెందిన శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు.
మధ్యప్రదేశ్‌ సహా ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం కలిపి 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 3న జరగనుంది.

పీజీ వరకు బాలికలకు ఉచిత విద్య, రైతులపై హామీల వర్షం- బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్​

Madhya Pradesh Assembly Election 2023 : కమల్​నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్​.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం!

MP Election Vindhya Region : ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్​.. బీజేపీ-కాంగ్రెస్​ 'ఢీ'.. వింధ్యలో విజయం ఎవరిదో?

MP Election Ayodhya Ram Mandir : బీజేపీ X కాంగ్రెస్​.. అయోధ్య రాముడి చుట్టూ మధ్యప్రదేశ్​ ఎన్నికల ప్రచారం!

Last Updated : Nov 16, 2023, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.