ETV Bharat / bharat

'బెయిల్ ఇస్తాం.. కానీ ఊర్లో మహిళలందరి బట్టలు ఉతకాలి'

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి న్యాయస్థానం వినూత్న షరతుతో బెయిల్ (Conditions for Bail) ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలని ఆదేశించింది. ఉచితంగా ఇస్త్రీ కూడా చేయాలని పేర్కొంది.

madhubani-court-granted-bail-to-accused-of-molestation-on-unique-condition
'బెయిల్ ఇస్తాం.. కానీ ఊరందరి బట్టలు ఉతకాలి'
author img

By

Published : Sep 22, 2021, 8:29 PM IST

బిహార్​ మధుబనీ (Madhubani Bihar) జిల్లాలో ఓ యువకుడికి వింత కండిషన్​తో బెయిల్ (Bail Conditions) ఇచ్చారు ఓ న్యాయమూర్తి. గ్రామంలోని మహిళల దుస్తులను ఉచితంగా ఉతికి, ఐరన్ చేయాలని షరతు విధించారు. ఓ మహిళను వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి యత్నించిన కేసులో యువకుడికి ఈ షరతులతో బెయిల్ ఇచ్చారు.

నిందితుడు లలన్ కుమార్ సాఫి(20) లాండ్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళల బట్టలు శుభ్రం చేయాలని అదనపు జిల్లా జడ్జి అవినాశ్ కుమార్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రామ సర్పంచ్​తో పాటు పంచాయతీతో పంచుకోవాలని చెప్పారు.

ఇదీ కేసు...

లౌకాహా పోలీస్ స్టేషన్ పరిధిలో లలన్ నివసిస్తున్నాడు. అత్యాచారానికి సంబంధించిన కేసులో 2021 ఏప్రిల్ 19 నుంచి జైల్లో ఉంటున్నాడు. ఏప్రిల్ 17న నిందితుడు ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 18న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఏప్రిల్ 19న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా, బెయిల్ కోసం నిందితుడు కోర్టును అభ్యర్థించాడు. అతడిపై పాత క్రిమినల్ కేసులేవీ లేనందున.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వినూత్న షరతు విధించింది. ఇలా చేయడం వల్ల నిందితుడికి మహిళలపై గౌరవం పెరుగుతుందని స్థానికులు చెప్పుకుంటున్నారు.

ఇదీ చదవండి: పుస్తకాలు చదివితే శిక్ష రద్దు- 'ఉగ్రవాది'కి కోర్టు వెరైటీ ఆఫర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.