ETV Bharat / bharat

అవును.. ఆ గొర్రె ధర 1.50 కోట్లే.! - గొర్రె మాంసం

ఒక్క గొర్రెకు లక్షల రూపాయల ధర పలకడం ఎప్పుడూ వినలేదా? అయితే.. మహారాష్ట్రకు వెళ్లాల్సిందే. ఒకటి, రెండూ కాదు ఏకంగా రూ.70లక్షలు వెచ్చించి గొర్రెను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఆ గొర్రె విశేషాలేంటో తెలుసుకుందాం.

Madgyal sheep gets offer of Rs 70 lakh
'బకరా' కావొద్దు.. దీని ధర రూ.1.50 కోట్లే!
author img

By

Published : Dec 13, 2020, 7:24 PM IST

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఓ గొర్రెను రూ.70 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. కానీ, ఆ గొర్రె యజమాని అంత తక్కువ ధరకు తాను అమ్ముబోనని చెప్పగా ఆ కొనుగోలుదారుడు వెనుదిరిగాడు.

అసలేంటీ గొర్రె ప్రత్యేకత..?

సంగ్లీ జిల్లా తెహ్‌సిల్‌కు చెందిన బాబు మెట్కారీ కుటుంబం గత కొన్ని దశాబ్దాలుగా గొర్రెల వ్యాపారం చేస్తోంది. వారి వద్ద దాదాపు 200పైగా మడ్గ్యాల్‌ జాతి గొర్రెలు ఉన్నాయి. ఇటీవల ఓ కొనుగోలుదారుడు రూ.70లక్షలు వెచ్చించి అతడి వద్ద ఉన్న ఓ మడ్గ్యాల్‌ గొర్రెను కొనేందుకు ఆసక్తి చూపించాడు. కానీ, రూ.1.50 కోట్లు చెల్లిస్తేనే దాన్ని విక్రయిస్తానంటున్నాడు దాని యజమాని మెట్కారీ.

"మడ్గ్యాల్‌ గొర్రెలకు మంచి డిమాండు ఉంది. మేం గత మూడు దశాబ్దాలుగా ఈ వ్యాపారం చేస్తున్నాం. సర్జా(గొర్రె పేరు) వల్ల మా కుటుంబానికి ఎంతో కలిసివచ్చింది. ప్రస్తుతానికి నేను ఆ గొర్రెను అమ్మాలనుకోవడం లేదు. రూ.70లక్షలకు సర్జాను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి వచ్చారు. కానీ నేను తిరస్కరించి.. రూ.1.50కోట్లు ధరకు ఇస్తానని చెప్పాను. దాని కోసం అంత ధర వెచ్చించలేరని తెలిసే నేను ఆ ధర చెప్పాను."

--బాబు మెట్కారీ, గొర్రెల వ్యాపారి.

అందుకే అంత ధర..

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా తెహ్‌సిల్‌ ప్రాంతం మడ్గ్యాల్‌ జాతి గొర్రెలకు ప్రసిద్ధి. ఆ జిల్లాలోని మడ్గ్యాల్‌ అనే గ్రామం పేరిట ఈ జాతి గొర్రెలకు ఆ పేరు వచ్చింది. ఇవి చూడటానికి దృఢంగా, బలిష్ఠంగా ఉంటాయి. మార్కెట్లో వీటి మాంసానికి భారీ డిమాండు ఉంటుంది. వీటి తల గుండ్రంగా ఉండి, రోమన్‌ ముక్కు కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఆ జిల్లావ్యాప్తంగా ఇవి 1.50లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ జాతి గొర్రెలను ఇతర ప్రాంతాల్లోనూ విస్తరింపజేసేందుకు ఇటీవల రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఇదీ చూడండి:ఇక్కడ టీ తాగితే కప్ తినాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.