ETV Bharat / bharat

థాయిలాండ్ మహిళకు పూనిన కాళీమాత.. భక్తులకు అభయం.. దర్శనానికి స్థానికుల క్యూ.. - బిహార్ గయా న్యూస్

కాళీమాత తన కలలోకి వచ్చిందని చెబుతోంది థాయ్​లాండ్​కు చెందిన ఓ మహిళ. కాళీమాత పూనినట్లు నాలుక బయటకు తీసి ఉగ్రరూపంలో కనిపిస్తోంది. ఈ ఘటన బిహార్​లో వెలుగుచూసింది.

maa kali came in dream
కాళీమాత రూపంలో థాయ్​లాండ్ మహిళ
author img

By

Published : Oct 3, 2022, 6:48 PM IST

థాయిలాండ్ మహిళకు పూనిన కాళీమాత

థాయిలాండ్​కు చెందిన అరణ్వి అనే ఓ మహిళ.. కాళీమాతలా ప్రవర్తిస్తోంది. తనకు కాళీమాత కళలోకి వస్తోందని చెబుతోంది. కాళీమాత పూనినట్లు నాలుక బయటకు తీసి.. ఉగ్రరూపం దాల్చుతోంది. బిహార్ గయాలో ఈ ఘటన జరిగింది. ఈ వార్త చుట్టుపక్కల ప్రజలకు వ్యాపించగా.. కాళీమాతలా కనిపిస్తున్న అరణ్విని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆమెను దేవతగా భావించి హారతులు ఇచ్చి.. పూజలు చేస్తున్నారు. అరణ్వి నుంచి ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు.

'థాయ్​లాండ్​కు చెందిన అరణ్వి.. గతంలోనే బోద్​గయాకు వచ్చారు. బౌద్ధ కుటుంబంలో పుట్టి, ఆ మతాన్ని ఆచరించే ఆమె.. ఆ తర్వాత సనాతన ధర్మంలోకి మారారు. వేల రూపాయలు వెచ్చించి కాళీ మందిరాన్ని నిర్మిస్తున్నారు. పేద ప్రజల కోసం అనేక మంచి పనులు సైతం చేస్తున్నారు. థాయ్ దేవతగా.. థాయిలాండ్​లోనూ ఆమె సుపరిచితులే' అని అరణ్వి సహాయకుడు పుష్కర్ వర్మ తెలిపారు.

కాగా, తనకు కలలో కాళీమాత కనిపించేదని అరణ్వి చెబుతున్నారు. 'నాకు కలలో భారతదేశం కనిపించింది. భారత్​లోని బోధ్​గయాకు రాగానే ముందుగా కాళీ మాత మందిరాన్ని దర్శించుకున్నా' అని అరణ్వి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.