ETV Bharat / bharat

రూ. 5వేలకే కారవాన్​.. ఇక రాష్ట్రాన్ని చుట్టేయండి - ల్స్​ కాంపర్​ క్యారవాన్​

అన్ని సదుపాయాలు ఉన్న కారవాన్​లో రాష్ట్రాన్ని చుట్టేయాలని కలలు కన్న ప్రజలకు బంపర్​ ఆఫర్​. రూ. 5వేలకే అలాంటి కారవాన్​ రోజంతా తిరిగవచ్చు. ఇందుకోసం సరికొత్త ప్రాజెక్టును ఆవిష్కరించింది కేరళ ప్రభుత్వం.

luxe camper caravan
రూ. 5వేలకే క్యారవాన్​.. ఇక రాష్ట్రాన్ని చుట్టేయండి
author img

By

Published : Dec 4, 2021, 11:04 AM IST

Updated : Dec 4, 2021, 11:36 AM IST

పర్యటకులను ఆకర్షించేందుకు.. కేరళ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. ఈ ట్రక్​ క్యాంపర్​ ప్రాజెక్టుతో పర్యటకులు.. విలాసవంతమైన సదుపాయాలు ఉన్న కారావాన్​లో ప్రయాణించి కేరళను చుట్టేయవచ్చు. దీనిని ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్​ రియాజ్​, రవాణా మంత్రి ఆంటోని రాజు శుక్రవారం ఆవిష్కరించారు.

luxe camper caravan
క్యారవాన్​లోని సదుపాయాలు

ఈ ప్రాజెక్టు కోసం కర్ణాటకకు చెందిన లక్స్​ క్యాంపర్​ సంస్థతో జతకట్టింది కేరళ ప్రభుత్వం. ఈ కారవాన్ ఓ చిన్నపాటి ఇల్లులా ఉంటుంది. ఇద్దరు పడుకునేందుకు వీలుగా బెడ్​రూం, ఏసీ, కిచెన్​, బాత్​రూం ఉంటాయి. లక్స్​ క్యాంపర్​ సైట్​ ద్వారా దీనిని బుక్​ చేసుకోవచ్చు. దీని ధర కేవలం రూ. 5వేలు. 2022 ఫిబ్రవరి నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయి.

luxe camper caravan
క్యారవాన్​లోని సదుపాయాలు

ఈ కారవాన్ల కోసం నిబంధనల్లో మార్పులు కూడా చేశారు. సీనియర్​ అధికారులు మాత్రమే వాటిని చెక్​ చేయాలి. సాధారణ పోలీసులు తనిఖీలు చేయకూడదు. తనిఖీల పేరుతో పర్యటకులను అధికారులు హింసిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:- సూపర్‌స్టార్‌ మహేశ్​ కొత్త క్యారవాన్‌ చూశారా..!

Last Updated : Dec 4, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.