ETV Bharat / bharat

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. రూ.6 లక్షలతో లింగమార్పిడి.. కట్​ చేస్తే ప్రేయసి మరో ట్విస్ట్

సాధారణంగా పెళ్లి అంటే ఎవరికైనా చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయే గుర్తుకువస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటుగా అబ్బాయిలు, అమ్మాయిల మనస్తత్వాలు కూడా మారుతున్నాయి. దీంతో లెస్బియన్​ వివాహాలు జరుగతున్నాయి. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం యూపీలో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అందులో ఒక అమ్మాయి.. లింగమార్పిడి చేసుకుంది. కానీ అబ్బాయిగా మారాక ఆ అమ్మాయి.. అతడ్ని దూరం పెట్టింది. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు.

girl changed gender in love with girl
girl changed gender in love with girl
author img

By

Published : Jan 21, 2023, 12:01 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో వింత ఘటన వెలుగుచూసింది. ఇద్దరమ్మాయిలు జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని.. ప్రతిజ్ఞ చేసుకుని కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం వారిలో ఓ అమ్మాయి.. లింగమార్పిడి చేసుకుని పురుషుడిగా మారింది. అబ్బాయిగా మారిన అనంతరం ఆమెతో కలిసుండడానికి నిరాకరించింది. దీంతో లింగమార్పిడి చేసుకున్న యువతి కోర్టును ఆశ్రయించింది.

అసలేంటీ ఈ ఇద్దరమ్మాయిల కథ..?
ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ జీవితాంతం కలిసుంటామని ప్రతిజ్ఞ చేసుకుని.. 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జీవించారు. కలిసి జీవించాలంటే ఇద్దరిలో ఒకరు మగవాడిగా ఉండాల్సిందేనని సోనాల్​.. సనా ఖాన్​కు చెప్పింది. దీంతో సనా ఖాన్​ దిల్లీలో లింగమార్పిడి ఆపరేషన్​ చేయించుకుని పురుషుడిగా మారింది. తన పేరును కూడా సుహైల్​ ఖాన్​గా మార్చుకుంది. అయితే అదే సమయంలో సోనాల్​ శ్రీవాత్సవకు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఆమెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత నుంచి సోనాల్​.. సనా​ ఖాన్​ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. అయితే సనా​ తన ప్రియురాలిని ఎన్నిసార్లు ప్రాధేయపడినా సరే ఆమె హృదయం చలించలేదు. కాగా, 'నేను నీతో కలిసి జీవించలేను. అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లి మళ్లీ అమ్మాయిగా మారు' అని సోనాల్​తో చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సనా ఖాన్​ అలియాస్​ సుహైల్ ఖాన్​​ కోర్టును ఆశ్రయించింది.

,.
సనా ఖాన్​తో కలిసుండడానికి నిరాకరించిన సోహైల్​ శ్రీవాత్సవ

ఈ విషయంపై సనా ఖాన్​ మే 30, 2022లో ఆన్​లైన్​ ద్వారా కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జూన్​ 3వ తేదీన కోర్టులో దావా వేసింది. సనా తో పాటుగా మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టు నమోదు చేసుకుంది. ఆ తర్వాత ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా
ఆదేశిస్తూ.. కోర్టు సోనాల్​కు నోటీసులు పంపింది. అయితే సోనాల్​ ఆ నోటీసులు స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో కోర్టు ఆమెపై అరెస్ట్​ వారెంట్​ను జారీ చేసింది. పోలీసులు జనవరి 18న సోనాల్​ను అరెస్ట్ చేసి.. జనవరి 19న తేదీన కోర్టులో హాజరుపరిచారు. కాగా, అదే రోజు సోనాల్​కు బెయిల్ మంజూరైంది. ఈ కేసుపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఆ సర్జరీ కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేసినట్లు సనా ఖాన్ తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.