ETV Bharat / bharat

Rath Yatra:నిరాడంబరంగా 'జగన్నాథ' రథయాత్ర

పూరీ జగన్నాథుని రథయాత్ర(jagannath rath yatra) ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరుగుతోంది. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒడిశా రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పూరీలో రెండు రోజుల పాటు కర్ఫ్యూ విధించింది.

Lord Jagannath Rath Yatra
జగన్నాథుని రథయాత్ర
author img

By

Published : Jul 12, 2021, 10:19 AM IST

దేశ వ్యాప్తంగా జగన్నాథుని రథయాత్ర(jagannath rath yatra) ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది మాదిరిగా భక్తులు లేకుండానే స్వామివారి రథయాత్ర జరుగుతోంది.

పూరీలోని శ్రీక్షేత్ర యంత్రాంగం, వివిధ శాఖల ఉన్నతాధికారులు.. నిరాడంబరంగా వేడుక నిర్వహిస్తున్నారు. ఆనవాయితీ ప్రకారం నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలపై జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శనుడు శ్రీక్షేత్రం వీడి పెంచిన తల్లి గుండిచా మందిరానికి బయల్దేరారు.

Lord Jagannath Rath Yatra
నిరాడంబరంగా రథయాత్ర
Lord Jagannath Rath Yatra
రథయాత్రలో పాల్గొన్న నిర్వహకులు

భక్తులు పూరీ రాకుండా రైళ్లు, బస్సులు నిలిపివేసి, పట్టణంలో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి కర్ఫ్యూ ప్రారంభమైందని, రెండు రోజుల పాటు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో భద్రతా బలగాలు మోహరించినట్లు స్పష్టం చేశారు. ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

గుజరాత్​..

గుజరాత్​లోనూ నిరాడంబరంగా జగన్నాథుని రథయాత్ర జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయరూపాని పూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. నిర్వహకులు సహా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Lord Jagannath Rath Yatra
భారీ భద్రత మధ్య రథయాత్ర
Lord Jagannath Rath Yatra
రథయాత్రలో పాల్గొన్న ప్రముఖులు

రథయాత్రలో కేంద్ర హోంమంత్రి

అహ్మదాబాద్​లో జరుగుతున్న జగన్నాథుని రథయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. జగన్నాథునికి ప్రత్యేక పూజలు చేశారు. 'కొన్నేళ్లుగా అహ్మదాబాద్​లోని జగన్నాథ ఆలయంలో మంగళ హారతిలో పాల్గొంటున్నాను. ఈ రోజు(సోమవారం) కూడా మహాప్రభువుని పూజించే భాగ్యం నాకు లభించింది. ఆ జగన్నాథుడు అందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలి' అంటూ ట్వీట్​ చేశారు.

Lord Jagannath Rath Yatra
జగన్నాథుdనికి హారతి ఇస్తున్న అమిత్​ షా
Lord Jagannath Rath Yatra
ప్రత్యేక పూజలు చేస్తున్న కేంద్ర హోంమంత్రి

రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

దేశ ప్రజలకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. "దేశ ప్రజలకు రథయాత్ర శుభకాంక్షలు. ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉండాలని జగన్నాథున్ని ప్రార్థిస్తున్నా" అని మోదీ ట్వీట్​ చేశారు.

ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ట్వీట్​ చేశారు. దేశ ప్రజలకు జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: Viral Video: గ్రామంలోకి చిరుతలు.. వణికిపోతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.