ETV Bharat / bharat

లోక్​సభ సమావేశాల కోసం ప్రత్యేక యాప్​- ప్రవేశపెట్టిన స్పీకర్ - లోక్​సభ వార్తలు తాజా

LS Mobile App: లోక్​సభ సమావేశాలను లైవ్​లో చూసేందుకు వీలుగా యాప్​ను రూపొందించింది కేంద్రం. దీనిని స్పీకర్​ ఓం బిర్లా మంగళవారం ప్రారంభించారు. 'ఎల్​ఎస్​ మెంబర్​ యాప్'​ను సభ్యులందరూ డౌన్​లోడ్​ చేసుకోవాలని పేర్కొన్నారు.

LS Mobile App
లోక్​సభ
author img

By

Published : Dec 21, 2021, 6:00 PM IST

LS Mobile App: లోక్​సభ సమావేశాల ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు వీలుగా రూపొందించిన ప్రత్యేక యాప్​ను స్పీకర్​ ఓం బిర్లా మంగళవారం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ 'ఎల్​ఎస్​ మెంబర్​ యాప్​'ను ప్రవేశపెట్టిన స్పీకర్​.. సభ్యులు యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవడం సహా వారి నియోజకవర్గ ప్రజలు కూడా వినియోగించుకునేలా​ కృషి చేయాలని కోరారు.

"పార్లమెంటు సమావేశాలను యూజర్లు లైవ్​లో వీక్షించేందుకు వీలుగా ఈ యాప్​ను రూపొందించారు. ప్రశ్నోత్తరాలు, డిబెట్లు, బులెటిన్లు సహా సభ్యుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. పార్లమెంటుకు సంబంధించిన ముఖ్య పత్రాలు, వివిధ కమిటీల రిపోర్ట్​లను చూడొచ్చు."

-ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్

సభలో గందరగోళం మధ్యే ఈ యాప్​ను ప్రవేశపెట్టారు ఓం బిర్లా. కాంగ్రెస్​, డీఎంకే, తృణమూల్​తో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు.. లఖీంపుర్​ ఖేరీ ఘటన సహా పలు అంశాలపై ప్లకార్డులతో నిరసన తెలిపాయి. కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రను పదవి నుంచి తొలగించాలంటూ పలు పార్టీలు నిరసన​ తెలపగా.. కర్ణాటకలో ఛత్రపతి శివాజీ విగ్రహం అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలంటూ శివసేన డిమాండ్​ చేసింది.

మరోవైపు డీఎంకే నేతలు కూడా ప్లకార్డులతో నిరసన తెలిపారు. నీట్​ పరీక్షల నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి : 'మహిళల వివాహ వయస్సు పెంపు.. వారికి నచ్చట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.