ETV Bharat / bharat

'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం.. మరో ముగ్గురు ఎంపీలపై వేటు​ - राष्ट्रपति द्रौपदी मुर्मू

केंद्रीय मंत्री स्मृति ईरानी ने कांग्रेस को घेरते हुए कहा कि जब से द्रौपदी मुर्मू का नाम राष्ट्रपति के उम्मीदवार के रूप में घोषित हुआ तब से ही द्रौपदी मुर्मू कांग्रेस पार्टी की घृणा और उपहास का शिकार बनीं. कांग्रेस पार्टी ने उन्हें कठपुतली तक कहा.

BJP Mps Protest:
BJP Mps Protest:
author img

By

Published : Jul 28, 2022, 11:44 AM IST

Updated : Jul 28, 2022, 12:34 PM IST

11:20 July 28

'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం.. మరో ముగ్గురు ఎంపీలపై వేటు​

  • #WATCH | BJP MPs in Parliament protest against Congress MP Adhir Ranjan Chowdhury, demand apology from him, on his 'Rashtrapatni' remark against President Droupadi Murmu in a video clip pic.twitter.com/zPovbGfLfM

    — ANI (@ANI) July 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

BJP Mps Protest: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు మహిళా ఎంపీలు పాల్గొన్నారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి గిరిజనురాలైన ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్‌ మొదటి నుంచి అవమానిస్తోందని ఆరోపించారు.

'దేశంలో గిరిజనులందరినీ అవమానించారు'.. గురువారం లోక్​​సభ ప్రారంభం కాగానే.. దేశ రాష్ట్రపతిని కాంగ్రెస్‌ పార్టీ అవమానపరిచిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే ఆ అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు. దేశంలో గిరిజనులు, పేదలు, అణగారిన వర్గాలందరినీ ఆయన అవమానించారని అన్నారు. ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలన్నారు. ఇరానీ వ్యాఖ్యలను భాజపా సభ్యులు సమర్థించారు. అయితే ఇప్పటికే అధీర్‌.. క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ తెలిపారు.

రాజ్యసభలో గందరగోళం.. ముర్ముపై అధీర్​ చేసిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్​ ఎంపీలు.. ప్లకార్డులు పట్టుకుని ఛైర్మన్​ వెల్​లోకి దూసుకెళ్లారు. ఆ చర్యను రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. ఆందోళనలు చేపడుతున్న ఎంపీలు సభ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. కానీ ఏ ఎంపీ పేరును ఆయన చెప్పలేదు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్​.. ముర్ముపై అధీర్​ రంజన్​ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు.

"ఓ గిరిజనురాలు రాష్ట్రపతిగా ఉండటం దేశానికి గౌరవం. రాష్ట్రపత్ని పదాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. రాష్ట్రపతి అనే పదం పురుషులు, మహిళలకు సమానం. అవి ఉద్దేశపూర్వకంగా చేసిన అసభ్య వ్యాఖ్యలు. కాంగ్రెస్‌ పార్టీ నిరాశలో ఉంది. సోనియా పేరుతో ఆందోళన చేస్తున్న వారు.. సభలో మాత్రం ధరల అంశంపై చర్చ జరగాలని డిమాండ్‌ చేస్తున్నారు. కుటుంబం, వారసత్వం తప్ప కాంగ్రెస్‌కు ఇంకెవరన్నా కూడా లెక్కలేదు."

-- నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థికమంత్రి

పోటాపోటీ నినాదాలతో.. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల పోటాపోటీ నినాదాలతో గురువారం ఉభయసభలు హోరెత్తాయి. దీంతో లోక్​సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటల వరకు స్పీకర్​ ఓం బిర్లా వాయిదా వేశారు. రాజ్యసభను సాయంత్రం నాలుగు గంటల వరకు ఛైర్మన్​ వెంకయ్య నాయుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సమయం ఇవ్వండి.. తనపై వస్తున్న ఆరోపణలపై సభలో మాట్లాడేందుకు కాస్త సమయం ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను అధీర్ రంజన్ చౌధరీ అభ్యర్థించారు. అందుకు సంబంధించిన లేఖను కూడా ఆయన స్పీకర్​కు అందించారు.
కాంగ్రెస్​ అత్యవసర సమావేశం.. కాంగ్రెస్​ సీనియర్​ నాయకులతో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం అత్యవసర సమావేశం కానున్నారు. పార్టీ నేతలు మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌధరీ తదితరులు హాజరు కానున్నారు.

మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. రాజ్యసభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్​ అయ్యారు. ఆమ్​ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ గుప్తాతో పాటు మరో ఇద్దరు ఎంపీలు .. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్​కు గురయ్యారు. ఇప్పటివరకు పార్లమెంటు నుంచి సస్పెండ్‌ అయిన సభ్యుల సంఖ్య 27కు చేరింది.

Last Updated : Jul 28, 2022, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.