ETV Bharat / bharat

Lokesh Comments on CBN Security: చంద్రబాబుకు జైలులో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్​ - రాజమండ్రిలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు

lokesh_comments_on_cbn_security_in_prison

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 12:04 PM IST

Updated : Sep 21, 2023, 2:27 PM IST

11:25 September 21

జైలులో అంతం చేసేందుకే అరెస్టు చేశారని అనుమానం ఉంది: లోకేశ్​

Lokesh Comments on CBN Security: చంద్రబాబుకు జైలులో ఏం జరిగినా జగన్‌దే బాధ్యత: లోకేశ్​

Lokesh Comments on CBN Security in Prison: చంద్రబాబును అంతం చేసేందుకే.. అక్రమ అరెస్టు చేయించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాల్లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకు జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోందని.. సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.

చంద్రబాబుకు జైలులో భద్రత లేదని.. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవట్లేదని ఆక్షేపించారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడన్నారు. చంద్రబాబుకు ఇలాగే చేయాలని సైకో కుతంత్రాలు అమలు చేస్తున్నారన్న లోకేశ్.. ఆయనకు ఏం జరిగినా జగన్​దే బాధ్యతన్నారు.

Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై ఎగసిన నిరసన జ్వాల.. విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు, యాగాలు

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో పార్టీ నేతలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ.. రాజమండ్రి జైలులో పరిస్థితులు, వైద్య సౌకర్యాలపై ఆందోళనగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిమాండ్ ఖైదీ ఇటీవల డెంగీ, టైఫాయిడ్‌తో మరణించాడని గుర్తు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి వారికి తీవ్ర ఆందోళన ఉందని.. జైలులోని పరిస్థితుల గురించి భువనేశ్వరి కూడా ఆవేదన చెందినట్లు ఆయన వివరించారు.

TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగిన టీడీపీ నిరసనలు

Last Updated : Sep 21, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.