ETV Bharat / bharat

సివిల్​ సర్వీసెస్​కు ఎంపికైన స్పీకర్ కుమార్తె

author img

By

Published : Jan 5, 2021, 4:49 PM IST

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కుమార్తె అంజలి.. సివిల్​ సర్వీసెస్​కు ఎంపికయ్యారు. యూనియన్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ 2019లో నిర్వహించిన పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించారు.

Lok Sabha Speaker's daughter selected for civil services
సివిల్ సర్వెంట్​గా ఓంబిర్లా కుమార్తె!

లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా కుమార్తె అంజలి.. సివిల్​ సర్వీసెస్​కు ఎంపికయ్యారు. దిల్లీ రాం​జాస్ కళాశాలో ​రాజనీతి శాస్త్రం పూర్తి చేసిన అంజిలి.. తొలి ప్రయత్నంలోనే సివిల్​ సర్వీసెస్​కు ఎంపిక కావడం విశేషం.

"నేను సివిల్స్​కు ఎంపికవడం చాలా ఆనందంగా ఉంది. మా నాన్నలానే సమాజానికి, దేశ ప్రజలకు నా వంతుగా సేవ చేయలనే ఉద్దేశంతో ఈ సర్వీసులో చేరాలనుకుంటున్నాను."

- అంజలి

తాను సివిల్స్​కు ఎంపిక కావడానికి చార్టర్డ్​ అకౌంటెట్​ అయిన తన సోదరి ఆకాన్షా కారణమని.. పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఎంతో సాయం చేశారని అంజలి తెలిపారు.

2019లో యూనియన్ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​(యూపీఎస్​సీ) నిర్వహించిన సివిల్​ సర్వీసెస్​ పరీక్ష ఫలితాలను ఆగస్టు 4న విడుదల చేశారు అధికారులు. రిజర్వు లిస్టులోని 829 మంది అభ్యర్థులకు తాజాగా ఇంటర్వ్యూ నిర్వహించింది యూపీఎస్​సీ. ఇందులో అంజలితో పాటు 89మంది ఎంపికయ్యారు.

ఇదీ చూడండి: ఫిబ్రవరి తొలి వారంలోనే కాంగ్రెస్​కు కొత్త సారథి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.