ETV Bharat / bharat

సార్వత్రిక సమరానికి ఈసీ సన్నాహాలు- ఆ రాష్ట్రాల్లో పర్యటన - 2024 lok sabha schedule

Lok Sabha Election 2024 : కేంద్ర ఎన్నికల సంఘం లోక్​సభ ఎలక్షన్లపై దృష్టిసారించింది. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించేందుకు వచ్చే వారం నుంచి పర్యటనలు చేపట్టనుంది. జనవరి 7న ఆంధ్రప్రదేశ్​లో పర్యటించనుంది.

Lok Sabha Election 2024
Lok Sabha Election 2024
author img

By PTI

Published : Jan 5, 2024, 10:57 AM IST

Updated : Jan 5, 2024, 11:47 AM IST

Lok Sabha Election 2024 : లోక్‌సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టనుంది. పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాలు ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాయో సమీక్షించేందుకు వచ్చే వారం నుంచి పర్యటనలు చేపట్టనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఇతర కమిషనర్లు అనూప్‌ చంద్రపాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన బృందం ఈనెల 7న ఆంధ్రప్రదేశ్‌లో, 10న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించనుంది. ఈసీ పర్యటనకు ముందు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధత గురించి ఈసీకి వివరించనున్నారు. డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఇప్పటికే అన్నిరాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించారు.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు మినహా!
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో ఈసీ పర్యటించి రాజకీయ పార్టీల నేతలు, సీనియర్‌ పోలీసు, పాలనా అధికారులతో పాటు క్షేత్రస్థాయి ఎన్నికల సిబ్బందితో సమావేశం కావడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఈసీ ఈసారి పర్యటించే అవకాశం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2019లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.

ఇక, 2024 సార్వత్రిక ఎన్నికల కోసం పాలకవిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్​డీఏను బలోపేతం చేసుకుంటున్న బీజేపీ- ఎన్నికల్లో విజయంపై ధీమాతో ముందుకెళ్తోంది. మూడోసారి మోదీ సర్కారు గ్యారెంటీ అని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఈ కూటమి ప్రస్తుతం సీట్ల పంపకం ఖరారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అయితే, సీట్ల సర్దుబాటుపై పలు రాష్ట్రాల్లో ఈ కూటమికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే బంగాల్​లో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్​కు రెండు సీట్లే ఇస్తామని టీఎంసీ ప్రతిపాదించగా- అవసరమైతే ఒంటరిగా బరిలోకి దిగుతామని హస్తం పార్టీ హెచ్చరించింది.

వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'

ఎన్నికల అస్త్రంగా 'రామ మందిరం'- బీజేపీ 15రోజుల ప్లాన్ రెడీ- RSSతో కలిసి కార్యక్రమాలు!

'3రాష్ట్రాల్లో ఓటమి- అయినా తగ్గేదేలే- సీట్ల సంఖ్యలోనే తేడా, ఓట్లలో కాదు!'

'2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యం- ఐక్యతే మార్గం'- కాంగ్రెస్​ శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం

Last Updated : Jan 5, 2024, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.