ETV Bharat / bharat

Schools Lockdown: ఆ ప్రాంతంలో లాక్​డౌన్​, స్కూళ్లు బంద్​.. కరోనాతో కాదు! - Tiger Terror in Buldana

Schools Lockdown: కరోనా కట్టడికి లాక్​డౌన్​ విధించడం చూశాం. కానీ ఆ ప్రాంతంలో వేరే కారణంతో ప్రజలు బయటకు వెళ్లడం లేదు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండా వాటిని మూసివేశారు. కారణమేంటంటే..?

tiger terror in Buldana
tiger terror in Buldana, పులి భయంతో స్కూళ్లు బంద్​
author img

By

Published : Dec 9, 2021, 8:33 PM IST

Tiger Terror: లాక్​డౌన్​ అనే పదం మనకు ఎలా తెలిసింది. కరోనా వెలుగులోకి వచ్చిన సమయంలో.. కట్టడికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్​డౌన్​లు విధించాయి. బహుశా చాలా మందికి అప్పుడే తెలిసి ఉంటుంది లాక్​డౌన్​ అంటే. భారత్​ కూడా ఇదే బాటలో నడిచింది. దేశవ్యాప్తంగా చాలా వరకు కార్యకలాపాలు నిలిచాయి. విద్యాసంస్థలు బంద్​ అయ్యాయి.

Tiger Terror Buldana: ఇప్పుడు.. మహారాష్ట్ర బుల్డాణా జిల్లా ఖామ్​గావ్​లో కూడా కొన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. కానీ కరోనా వల్ల కాదు. ఓ పులికి భయపడి.. అవును నిజం.

తొలుత కేశవ్​ నగర్​ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు డిసెంబర్​ 4న తెలిసింది. మరో రెండు రోజులకు ఖమ్​గావ్​లో ఆవు దూడ చనిపోయి కనిపించింది. తొలుత ఆవును చంపింది కుక్క అనిపించినా.. అది పులి అని తర్వాత తెలుసుకున్నారు. పులిని పట్టుకునేందుకు బుల్డాణా, యావత్మాల్​, అకోలా ప్రాంతాల్లో.. అటవీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Lockdown of Two Schools: ఈ నేపథ్యంలోనే.. అక్కడ చదువుకునే ప్రజలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు బంద్​ చేశారు. శ్రీ అర్జన్​ ఖిమ్​జీ నేషనల్​ హైస్కూల్​ అండ్​ జూనియర్​ కాలేజి, శ్రీమతి సురజ్​దేవీ మహిళా మహావిద్యాలయ్​ అండ్​ లయన్స్​ జ్ఞాన్​పీఠ్​ పాఠశాలలు మూసివేశారు. పులిని పట్టుకున్న తర్వాతే వాటిని తిరిగి తెరవనున్నట్లు వెల్లడించారు.

ప్రజలను కూడా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లనీయడం లేదు.

ఇదీ చూడండి: వారికోసం పల్లకిలో అంబులెన్సు సేవలు .. ఐడియా అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.