దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. వాటిని లెక్కచేయకుండా రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజలు. బంగాల్ తూర్పు మెదీనిపుర్లోని మహిశాదల్లో ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు.
కశ్మీర్లో ధూందాంగా..
కశ్మీర్ సరిహద్దులో ధూందాంగా హోలీ వేడుకలు జరిగాయి. పూంఛ్‌లో ఈ వేడుకలకు జిల్లా అభివృద్ధి అధికారి, ఎస్ఎస్పీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం నుంచే పిల్లలు, పెద్దలు రంగుల చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. మరికొన్ని చోట్ల రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు.
కరోనాను లెక్కచేయకుండా..
పంజాబ్ అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయంలో భక్తులు ఘనంగా హోలీ జరుపుకొన్నారు. దేశంలో కరోనా 2.0 అధికస్థాయిలో వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ మూడో స్థానంలో ఉంది. వైరస్‌ను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. వాటిని ఏ మాత్రం లెక్కచేయకుండా ప్రజలు ఇలా గుమిగూడటం ఆందోళన కల్గిస్తోంది.
మోదీకి మోరిసన్ శుభాకాంక్షలు..
హోలీ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ శుభాకాంక్షలు తెలిపారు. 'నా ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీకి, మా దేశ హిందూ ప్రజలకు, హోలీ జరుపుకొనే వారందరికీ రంగుల హోలీ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు.
-
Wishing our Hindu Australian community, my good friend @narendramodi and all the people who are celebrating it, a happy and colourful Holi!
— Scott Morrison (@ScottMorrisonMP) March 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
होली की शुभकामनाएँ। pic.twitter.com/rjz1MA8gHJ
">Wishing our Hindu Australian community, my good friend @narendramodi and all the people who are celebrating it, a happy and colourful Holi!
— Scott Morrison (@ScottMorrisonMP) March 28, 2021
होली की शुभकामनाएँ। pic.twitter.com/rjz1MA8gHJWishing our Hindu Australian community, my good friend @narendramodi and all the people who are celebrating it, a happy and colourful Holi!
— Scott Morrison (@ScottMorrisonMP) March 28, 2021
होली की शुभकामनाएँ। pic.twitter.com/rjz1MA8gHJ
ఇదీ చదవండి: లాక్డౌన్ లేదంటూనే రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు