ETV Bharat / bharat

సహజీవనంపై హైకోర్టు సంచలన తీర్పు - Tarn Taran district.

సహజీవనం​ నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాదని పంజాబ్-హరియాణా హైకోర్టు స్పష్టం చేసింది. పారిపోయిన ఓ జంట రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

Live-in-relationships morally, socially unacceptable
సహజీవనం ఆమోదయోగ్యం కాదు
author img

By

Published : May 18, 2021, 4:45 PM IST

లివ్​ ఇన్​ రిలేషన్​షిప్​(సహజీవనం)పై పంజాబ్-హరియాణా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నైతికంగా, సామాజికంగా అది ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. తమకు రక్షణ కల్పించాలంటూ పారిపోయిన ఓ జంట దాఖలు చేసిన పిటిషన్​ను పరిశీలించిన న్యాయస్థానం కొట్టివేసింది.

తామిద్దరం కలిసే ఉంటున్నామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని ఆ జంట.. పిటిషన్​లో పేర్కొంది. అమ్మాయి కుటుంబం నుంచి వారికి ప్రాణహాని ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

''పిటిషనర్లు తమ లివ్​ ఇన్​ రిలేషన్​షిప్​కు ఆమోద ముద్ర కోరుతున్నారు. ఇది నైతికంగా, సామాజికంగా ఆమోదనీయం కాదు. వారికి రక్షణ కల్పించలేం. అందుకే పిటిషన్​ను కొట్టివేస్తున్నాం.''

- జస్టిస్​ హెచ్​ఎస్​ మదన్​

ఈ తీర్పు మే 11న వెలువడగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.

ఇదీ చూడండి: 'సహజీవనం చేస్తే పోక్సో చట్టం కింద శిక్షలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.