ETV Bharat / bharat

కరోనా వేళ విహారమా? ఈ దేశాల్లో సాధ్యమే!

విహార యాత్ర కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కరోనా సమయంలోనూ భారత పౌరులను అనుమతిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి. మీ దగ్గర భారత ప్రభుత్వం జారీ చేసిన పాస్​పోర్ట్ ఉండి, కొన్ని నిబంధనలు పాటిస్తే చాలు హాయిగా ఆ దేశాల్లో విహార యాత్ర చేపట్టొచ్చు.

list of countries allowing indian tourists amid covid pandemic
కరోనా వేళ విహారమా? ఈ దేశాల్లో సాధ్యమే!
author img

By

Published : May 25, 2021, 2:31 PM IST

రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు భారత ప్రయాణాలపై నిషేధం విధించాయి. యూకే, కెనడా, యూఎస్, యూరప్, యూఏఈ, హాంకాంగ్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు భారత్​ నుంచి రాకపోకలను నిషేధించాయి. ఇటీవల భారత టూరిస్టులపై నిబంధనలను సడలించిన మాల్దీవులు, నేపాల్, యూఏఈ వంటి దేశాలు కూడా మళ్లీ ఆంక్షలు విధించాయి.

అయితే, విహారయాత్రకు వెళ్లే పర్యటకులను అనుమతించే దేశాలు కొన్ని ఉన్నాయి. పలు నిబంధనలతో విహారానికి అనుమతిస్తున్నాయి. అవేంటంటే..

రష్యా ఓకే, కానీ...

రష్యా వంటి కొన్ని దేశాలు మాత్రమే టూరిస్టులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. కానీ అక్కడికి వెళ్లేందుకు కొన్ని విమానాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక రష్యా నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడికి వెళ్తే తిరిగిరావడం మరింత ఆలస్యం కావొచ్చు. ఇక ఎందరో ఆశించిన 'టీకా హాలిడే టూర్​'లను ఆ దేశం నిర్వహించడం లేదు. పర్యటకులకు వ్యాక్సిన్ అందించడం లేదని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.

టర్కీ

భారత టూరిస్టులకు స్వాగతం పలుకుతోంది టర్కీ. అయితే, అక్కడికి వెళ్లిన వెంటనే 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలి. 14వ రోజు ఆర్​టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్ వస్తే క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు వెళ్లొచ్చు.

ఈజిప్ట్

పర్యటకులను ఆకర్షించే దేశాల్లో ఈజిప్ట్ ఒకటి. ఈజిప్ట్ పిరమిడ్లను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. కరోనా సమయంలోనూ భారతీయ టూరిస్టులపై ఈజిప్ట్ నిషేధం విధించలేదు. కానీ కొన్ని ఆంక్షలను పాటించాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్లిన వెంటనే ర్యాపిడ్ డీఎన్ఏ టెస్టు చేయించుకోవాలి. పాజిటివ్​ అని తేలితే 14 రోజుల పాటు ఐసోలేషన్​లో ఉండాలి. లేదంటే తిరిగి తమ స్వస్థలానికి వెళ్లిపోవాలి.

దక్షిణాఫ్రికా

భారత పర్యటకులపై దక్షిణాఫ్రికా ఎలాంటి ఆంక్షలు విధించనప్పటికీ.. ఆ దేశానికి వెళ్లే విమానాలు మాత్రం తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో లెవెల్-1 కర్ఫ్యూ అమలవుతోంది. దీని ప్రకారం ప్రయాణాలపై కొన్ని ఆంక్షలు ఉంటాయి.

ఇదీ చదవండి- నిషేధిత జాబితాలోకి ట్విట్టర్​, ఫేస్​బుక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.