దివంగత గాయకుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితంపై కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో శాశ్వత అధ్యయన కేంద్రం ఏర్పాటు కానుంది.
గత నవంబర్‌లో ఏర్పాటైన తాత్కాలిక కేంద్రానికి రూ.5లక్షలు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎస్పీబీ శాశ్వత అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మైసూర్ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్ హేమంత్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు.
'' ఎస్పీబీ జీవితంలోని భిన్న కోణాలపై పరిశోధనలతో పాటు.. సినీ, సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలపై అధ్యయనం కోసం ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఒక ప్రొఫెసర్‌ను నియమించాం. ఈ కేంద్రం ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తుంది.''
-హేమంత్ కుమార్, మైసూర్ విశ్వవిద్యాలయ కులపతి.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై అధ్యయనం చేయాలని గేయ రచయిత హంసలేఖ ప్రతిపాదించారు.
ఇదీ చదవండి: బాలూ స్వరం దేవుడిచ్చిన వరం: అమితాబ్