Helicopter Ride to see Jallikattu: అక్కడ ఆసక్తికరంగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. యువకులు ఎద్దులతో ఉత్సాహంగా తలపడుతున్నారు. అప్పుడే పెద్దశబ్దం చేసుకుంటూ వచ్చి హెలికాప్టర్ ల్యాండయింది. క్షణాల్లో అంతా అక్కడ వాలిపోయారు. అక్కడ దిగింది బిజినెస్మెన్ బాబు మరి.
![businessman landed in a helicopter to see Jallikattu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-dpi-01-helicopter-coming-view-jallikattu-vis-tn10041_03022022160658_0302f_1643884618_161_0302newsroom_1643909379_238.jpg)
ఐదో తరగతి వరకే చదివిన బాబు.. పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. రూ. 10 వేల కోట్ల విలువైన అటికా జువెలరీ కంపెనీకి ఆయనే యజమాని. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయన సంస్థకు బ్రాంచ్లు ఉన్నాయి.
![businessman landed in a helicopter to see Jallikattu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-dpi-01-helicopter-coming-view-jallikattu-vis-tn10041_03022022160658_0302f_1643884618_181_0302newsroom_1643909379_405.jpg)
ధర్మపురి జిల్లా తడంగం పంచాయతీ పరిధిలో బుధవారం జల్లికట్టు పోటీలు నిర్వహించారు. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షించేందుకు బాబు.. బెంగళూరు నుంచి కుటుంబసమేతంగా హెలికాప్టర్లో విచ్చేశారు. స్థానికులు ఆయనకు పూలమాలలు వేసి.. కరతాళ ధ్వనులతో ఘనస్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా కోలాహలం నెలకొంది.
![businessman landed in a helicopter to see Jallikattu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-dpi-01-helicopter-coming-view-jallikattu-vis-tn10041_03022022160658_0302f_1643884618_232_0302newsroom_1643909379_119.jpg)
అనంతరం.. విజేతలకు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి అందించారు బాబు. బాగా ఆడిన వారిని అభినందించారు. సుమారు 700కుపైగా ఎద్దులు, 300 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పాఠశాలలోకి ప్రవేశించిన చిరుత.. వీడియో వైరల్