ETV Bharat / bharat

అలా అన్నారని న్యాయవాది ఆత్మహత్య.. తోటి లాయర్ల నిరసన.. హైకోర్టుకు నిప్పు! - మధ్యప్రదేశ్ హైకోర్టుకి నిప్పు

కేసు విచారణ వేళ అవమానకర వ్యాఖ్యలు చేశారని హైకోర్టు న్యాయవాది ఒకరు ఆత్మహత్య చేసుకోవడం.. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో పెను దుమారం రేపింది. సహచర లాయర్లు తీవ్రస్థాయిలో నిరసనగా దిగారు. కోర్టులో విధ్వంసానికి పాల్పడ్డారు. న్యాయస్థానానికి నిప్పుపెట్టారు.

MP High Court
MP High Court
author img

By

Published : Sep 30, 2022, 7:04 PM IST

Updated : Sep 30, 2022, 8:05 PM IST

అలా అన్నారని న్యాయవాది ఆత్మహత్య.. తోటి లాయర్ల నిరసన.. హైకోర్టుకు నిప్పు!

MP High Court Fire: మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో హైకోర్టు న్యాయవాది ఆత్మహత్య పెను విధ్వంసానికి కారణమైంది. అనురాగ్​ సాహూ అనే న్యాయవాది బలవన్మరణానికి పాల్పడగా.. ఆయన తోటి న్యాయవాదులు శుక్రవారం తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టారు. హైకోర్టు ప్రాంగణంలో విధ్వంసానికి పాల్పడ్డారు. న్యాయస్థానానికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

ఏం జరిగిందంటే?
అనురాగ్ సాహూ.. జబల్​పుర్​ హైకోర్టులో న్యాయవాది. ఓ అత్యాచారం కేసులో బాధితుల పక్షాన ఆయన వాదిస్తున్నారు. ఈ కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్​పై శుక్రవారం జస్టిస్ సంజయ్ ద్వివేది ధర్మాసనం ఎదుట విచారణ జరిగింది. ఆ సమయంలో.. అనురాగ్ సాహూకు, నిందితుడి తరఫు న్యాయవాదికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చివరకు ఇద్దరూ వ్యక్తిగతంగా దూషించుకునే స్థాయికి పరిస్థితి చేరింది. కాసేపటికే కోర్టు నుంచి హడావుడిగా ఇంటికి వెళ్లిపోయారు అనురాగ్ సాహూ. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు.

మధ్యప్రదేశ్​ హైకోర్టుకు నిప్పు

విషయం తెలిసిన వెంటనే.. తోటి న్యాయవాదులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అనురాగ్ మృతదేహాన్ని తీసుకుని నేరుగా హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. న్యాయవాదుల నిరసన కాసేపటికే హింసాయుతంగా మారింది. లాయర్లు.. జస్టిస్ సంజయ్ ద్వివేది ఉన్న కోర్టు లోపలకు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడి వస్తువులకు నిప్పు అంటించారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు పెద్ద సంఖ్యలో న్యాయస్థానానికి చేరుకున్నారు. అయితే.. వారిని లాయర్లు అడ్డుకున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందినీ చాలాసేపు లోపలకు రానివ్వలేదు. చివరకు.. న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిరసనలో పాల్గొన్న న్యాయవాదుల్లో చాలా మంది జిల్లా కోర్టుల్లో పనిచేసే వారని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: అయ్యో పాపం.. పిల్లి కరిచిందని ఆస్పత్రికి వెళ్తే.. కుక్క దాడి!

ఖర్గే X థరూర్ X త్రిపాఠీ​.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలుపెవరిదో?

Last Updated : Sep 30, 2022, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.