రావత్ దంపతులకు తుది వీడ్కోలు..
దేశ రక్షణ కోసం జీవితాన్ని అర్పించి, సైన్యంలో సుదీర్ఘ సేవలందించిన భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌కు ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. దిల్లీలోని బార్ స్క్వేర్ శ్మశానవాటికలో.. బిపిన్ రావత్, మధులికా రావత్ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో శుక్రవారం సాయంత్రం జరిగాయి. రావత్‌కు గౌరవసూచికగా.. 17 తుపాకులతో వందనం చేసింది సైన్యం. కుటుంబసభ్యులు, దాదాపు 800మంది మిలిటరీ సిబ్బంది.. రావత్ దంపతులకు తుది వీడ్కోలు పలికారు.
అంతకుముందు.. శ్మశానవాటికలో రావత్ దంపతులకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు వివిధ దేశాల రక్షణశాఖ అధికారులు నివాళులర్పించారు.