ETV Bharat / bharat

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రాంచీ నుంచి దిల్లీకి తరలింపు! - RJD supremo lalu

Lalu prasad yadav: రాంచీలోని రిమ్స్​లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్​ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్​కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

lalu health
లాలూ ప్రసాద్ యాదవ్
author img

By

Published : Mar 22, 2022, 12:15 PM IST

Lalu Yadav Health: ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్​లో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం దిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్​ మెడికల్​ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే లాలూను దిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్ళనున్నారు. బోర్డు నిర్ణయం కోసమే అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు రిమ్స్​లోనే చికిత్స పొందుతున్న ఆర్​జేడీ ఎంపీ ఆర్​కే రాణాను దిల్లీకి తరలించేందుకు మెడికల్ బోర్డు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Lalu Fodder Scam

పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యం కారణంగా రాంఛీలోని రిమ్స్​లో చేరారు. అక్కడే చాలా రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న చీఫ్​ డాక్టర్ విద్యాపాటి.. దిల్లీలోని ఎయిమ్స్​కు తరలించాలని సూచించారు. ఈ విషయంపైనే రిమ్స్​ మెడికల్ బోర్డు సమావేశమైంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత లాలూను దిల్లీ ఎయిమ్స్​కు తరలించే అవకాశం ఉంది.

పశువుల దాణ కుంభకోణం కేసులోనే అరెస్టయిన ఆర్జేడీ ఎంపీ ఆర్​కే రాణా కూడా రిమ్స్​లోనే చికిత్స పొందుతున్నారు. ఆయనను కూడా దిల్లీకి తరలించనున్నారు.

ఇదీ చదవండి: ఆ కిట్​లో రబ్బరు పురుషాంగం- ఆశా వర్కర్లు షాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.