బిహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని భాజపా నేత సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. ఆర్జేడీ అధికారంలో వచ్చేలా ఎన్డీఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేప్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు మోదీ. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి వద్దకు సెల్‌ఫోన్ ఎలా వచ్చిందని మండిపడ్డారు.
-
लालू यादव ने दिखाई अपनी असलियत
— Sushil Kumar Modi (@SushilModi) November 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
लालू प्रसाद यादव द्वारा NDA के विधायक को बिहार विधान सभा अध्यक्ष के लिए होने वाले चुनाव में महागठबंधन के पक्ष में मतदान करने हेतु प्रलोभन देते हुए। pic.twitter.com/LS9968q7pl
">लालू यादव ने दिखाई अपनी असलियत
— Sushil Kumar Modi (@SushilModi) November 25, 2020
लालू प्रसाद यादव द्वारा NDA के विधायक को बिहार विधान सभा अध्यक्ष के लिए होने वाले चुनाव में महागठबंधन के पक्ष में मतदान करने हेतु प्रलोभन देते हुए। pic.twitter.com/LS9968q7plलालू यादव ने दिखाई अपनी असलियत
— Sushil Kumar Modi (@SushilModi) November 25, 2020
लालू प्रसाद यादव द्वारा NDA के विधायक को बिहार विधान सभा अध्यक्ष के लिए होने वाले चुनाव में महागठबंधन के पक्ष में मतदान करने हेतु प्रलोभन देते हुए। pic.twitter.com/LS9968q7pl
"రాంచి నుంచి ఎన్డీఏ ఎమ్మెల్యేకు లాలూ ప్రసద్ ఓ నంబర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయనకు మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు.
నేను అదే నంబర్‌కు కాల్చేసి మాట్లాడాను. లాలూనే నేరుగా ఫోన్ లిఫ్ట్ చేశారు. జైలులో ఉండి ఇలా పనులు చేయవద్దని.. మీరు గెలవలేరని చెప్పా."
- సుశీల్ కుమార్ మోదీ
సుశీల్ మోదీ విడుదల చేసిన ఆడియో టేపులో సంభాషణలు ఇలా..
లాలూ: పాసవాన్ జీ నమస్తే.. మీరు వినండి.. రేపు స్పీకర్ ఎన్నిక ఉంది. మీరు మాకు మద్దతు ఇవ్వండి. మిమ్మల్ని మంత్రిని చేస్తాం.
పాసవాన్: పార్టీలో ఉన్నా కదండి..
లాలూ: ఆ రోజు మీరు రావొద్దు.. కరోనా వచ్చిందని చెప్పండి. స్పీకర్ మన వారు ఉంటే అప్పుడు చూసుకోవచ్చు కదా.
ఇదీ చూడండి: మతాలకు అతీతం.. అయోధ్య 'సత్యార్థ్' ఆలయం