ఓ వైపు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా స్థానికుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి పరిపాలనా విభాగం సంస్కరణల పేరుతో కొత్త నిర్ణయాలను తీసుకుంది. ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసే దిశగా కొత్త ఆదేశాలు జారీ చేసింది. స్థానికంగా ఉండే చేపల పడవల్లో ప్రభుత్వ అధికారులను నియమించేందుకు ముందుకు వచ్చింది. పరిశుభ్రత నిర్వహణపై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. జూన్ 4 న జారీ చేసిన విధంగా కొబ్బరి చిప్పలు, చెట్ల ఆకులు మొదలైన వాటిని శాస్త్రీయంగా పారవేయాలని ఆదేశించింది.
కొత్తగా జారీ చేసిన ఆదేశాలపై లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ మండిపడ్డారు. అవి ఒట్టి బూటకపు ఉత్తర్వులని, వాటిని వెంటనే అధికారులు వెనక్కి తీసుకోవాలని కోరారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ, అడ్వైజర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ అధ్యక్షతన మే 28న జరిగిన సమావేశంలో స్థానికంగా ఉండే ఫిషింగ్ బోట్ల్లో బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగులను భద్రత కొరకు నియమించాలని నిర్ణయించింది. అంతేగాక భద్రతా చర్యలను బలోపేతం చేయడమే కాకుండా... ప్రయాణీకుల పడవలు, ఓడల తనిఖీని ముమ్మరం చేయాలని తీర్మానం చేసింది. ఇందుకుగానూ సీసీటీవీలను ఏర్పాటు చేయాలని తెలిపింది.
ఇదీ చూడండి: లక్షద్వీప్‌లో రాజకీయ రగడ- అసలేం జరుగుతోంది?