Lakhimpur Kheri Case: లఖింపుర్ ఖేరీ ఘటన కుట్రపూరితంగానే జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే లఖింపుర్ ఖేరీ ఘటన జరిగిందన్న సిట్ నివేదికను ఆయన సమర్థించారు.
"ఈ ఘటనకు ఎవరి కుమారుడు కారణమో.. ప్రజలకు తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి. ఇదే విషయంపై పార్లమెంట్లో చర్చకు ప్రధాని మోదీ నిరాకరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. రైతులు, ప్రతిపక్షాల ఒత్తిడితోనే కేంద్రం రైతు చట్టాలను వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడి చేస్తేనే కేంద్రం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటుంది."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
లఖింపుర్ ఘటనపై చర్చించాల్సిందే..
Lakhimpur Kheri Case Parliament: అంతకుముందు.. లఖింపుర్ ఖేరీ ఘటన పార్లమెంటును కుదిపేసింది. లోక్ సభలో ఘటనపై చర్చించాలని అటు కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.
ఈ క్రమంలో.. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు సభ ప్రారంభం కాగా.. విపక్షాలు మాత్రం లఖింపుర్ ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభకు గురువారానికి వాయిదా వేశారు స్పీకర్.
ఇదీ చూడండి: Parliament live: కుదిపేసిన 'లఖింపుర్' ఘటన- లోక్‌సభ రేపటికి వాయిదా